Sunday, May 5, 2024
- Advertisement -

సైరా కి కత్తెర్లు భారీగా పడుతున్నాయా?

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో దసరా కి విడుదల కానున్న చిత్రం సైరా నరసింహరెడ్డి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. చిత్ర యూనిట్ నిర్మాణాంతర పనుల్లో బిజీ గా ఉన్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో ఈ సినిమా ని రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కి ఇండస్ట్రీ లో మంచి పాజిటివ్ బజ్ నడుస్తుంది.

అయితే తాజా ఇండస్ట్రీ వర్గాల కథనాల ప్రకారం ఈ సినిమా ని ట్రిమ్ చేసే పని లో సురేందర్ రెడ్డి, చిరంజీవి బిజీ గా గడుపుతున్నారట. ఈ సినిమా రన్ టైం విషయం లో ఇద్దరూ చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటున్నారట. అందుకే బోర్ కొట్టకుండా అవసరం లేదు అనే సన్నివేశాలని సినిమా లో నుంచి తీసేయనున్నారట. సినిమా అద్భుతం గా వచ్చినా నిడివి ఎక్కువ ఉండకుండా జాగ్రత్త పడటం మంచిది అని చిరంజీవి ఆలోచన అని తెలుస్తుంది.

ఈ సినిమా ని ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ నెలలో విడుదల చేయాలి అని భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో చిరంజీవితో పాటు అమితాబ్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్ నటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -