Saturday, May 18, 2024
- Advertisement -

దంచవే మేనత్త కూతురా అంటున్న కళ్యాణ్

- Advertisement -

పటాస్ సినిమా తరవాత చాలా జాగ్రత్తగా తన కెరీర్ ని ప్లాన్ చేస్తున్నాడు హీరో కళ్యాణ్ రామ్ . కంగారు పడిపోయి వరసగా హిట్లు కొట్టేయ్యాలనే ఆలోచన లేకుండా నెమ్మది నెమ్మదిగా కథ తో పాటు కథనం కూడా సరిగ్గా ఇవ్వగలడు అనే డైరెక్టర్ ఉన్నప్పుడే ఆ సినిమాకి సంతకం పెడుతున్నాడు. ఇప్పటికే ఇజం సినిమా అంటూ పూరీ జగన్నాథ్ తో ప్రయోగం చేస్తున్న కళ్యాణ్ ఇప్పుడు రెండు సినిమాలు కమిట్ అయ్యాడు.

ఆల్రెడీ సాయిధరమ్ తేజ్ తో కలిసి ఎ.ఎస్.రవికుమార్ చౌదరితో ఓ మల్టీస్టారర్ చేయడానికి కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కామెడీ చిత్రాల స్పెషలిస్టు జి.నాగేశ్వరరెడ్డితో ఓ సినిమా కమిటయ్యాడు. చాలా వరకు సీరియస్ సినిమాలే చేసే కళ్యాణ్ రామ్.. కామెడీ సినిమాలకు పెట్టింది పేరైన నాగేశ్వరరెడ్డితో జట్టు కట్టబోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

ఈ సినిమాని భారీ సినిమాల నిర్మాత బీవీవీయెన్ ప్రసాద్ నిర్మించడం విశేషం. బాలకృష్ణ ఫేమస్ పాత ‘ దంచవే మేనత్త కూతురా ‘ లోంచి లిఫ్ట్ చేసిన ఈ టైటిల్ సినిమాకి హై లైట్ కాబోతోంది.

Related

  1. ” పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది “
  2. ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్, బన్నీకి ధరమ్ తేజ్ షాక్ ఇచ్చారు
  3. పవన్ కళ్యాణ్ కడప కింగ్ స్టోరీ!
  4. పవన్ కళ్యాణ్ కొంప ముంచుతాడా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -