- Advertisement -

అలీ, ప‌వ‌న్‌కు మ‌ధ్య అందుకే ఆ గ్యాప్ ..

- Advertisement -

అలీ, ప‌వ‌న్ కళ్యాణ్ మ‌ధ్య ఇండ‌స్ట్రీలో మంచి స్నేహ బంధం ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పెద్ద‌గా ఎవ్వ‌రితో క‌లివిడిగా ఉండ‌రు.అలాంటిది ప‌వ‌న్‌కు అలీకి మ‌ధ్య మంచి ర్యాంప్ ఉంది. చాలా ద‌గ్గ‌ర అయ్యాడు. వీరి స్నేహం తొలిప్రేమ సినిమా దగ్గ‌ర నుండి కొన‌సాగుతుంది.ప‌వ‌న్ తీసిని ప్ర‌తి సినిమాలో అలీ యాక్ట్ చేశాడు.క్యారెక్ట‌ర్ లేక‌పొయిన అలీ కోసం సినిమాలో చిన్న వేషం అయిన ఇచ్చేవాడు ప‌వ‌న్‌. అలా కొన‌సాగిన వీరి స్నేహం గ‌త కొంతకాలంగా గ్యాప్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది.మొన్న వ‌చ్చిన అజ్ఞాతవాసి సినిమాలో అలీ లేకపొయ్యే స‌రికి అంద‌రికి ఈ డౌట్ బ‌ల‌ప‌డింది.దీని గురించి అలీని ప్ర‌శ్నిస్తే ఆయ‌న ఏం చెప్పారంటే….ప‌వ‌న్ న‌టించిన మొద‌టి సినిమాలో నేను చేయలేదు… త‌రువాత అజ్ఞాత‌వాసి సినిమాలో నేను చేయ‌లేదు,సినిమాలో అవ‌కాశం ఉంటే నన్ను పిలుస్తారు, లేక‌పోతే పిల‌వ‌రు అని వివ‌ర‌ణ ఇచ్చాడు అలీ.

అయిన ఎంత స్నేహం ఉన్నా ప్ర‌తి సినిమాలో చాన్స్ ఇవ్వ‌ల‌ని ఏమైనా రూల్ ఉందా అని అలీ ఎదురు ప్ర‌శ్రించారు.పైగా ప‌వ‌న్ సినిమాలను వ‌దిలి రాజ‌కీయ‌లలోకి వెళ్లారు, మీరు కూడా జన‌సేన‌లో జాయిన్ అవుతారా అంటే దానికి కాల‌మే నిర్ణ‌యించాలి అని స‌మ‌ధానం ఇచ్చాడు అలీ.అలీకి మొద‌టి నుండి టీడీపీ సభ్యత్వం ఉంది. పొయిన ఎన్నిక‌ల‌లో అలీకి రాజ‌మండ్రి ఎంపి సీటు ఇస్తారు అనే ప్ర‌చారం జరిగింది కాని… దానికి మురళీమోహన్ పోటి చేయ్య‌డంతో అలీ వెన‌క్కి త‌గ్గారు అని తెలుస్తుంది.మ‌రి ప‌వ‌న్ జ‌న‌సేన ..  అలీ టీడీపీ అయితే ఒక‌రిపై ఒకరు విమ‌ర్శ‌లు చేసుకొక త‌ప్ప‌దు.వీరి స్నేహ బంధం చివ‌రికి రాజ‌కీయ శ‌త్రుత్వంగా మారే అవ‌కాశం క‌నిపిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -