Friday, May 10, 2024
- Advertisement -

స‌వ‌తి త‌ల్లిపై కామెంట్స్ చేసిన శృతి

- Advertisement -

క‌మ‌ల్ హాస‌న్ రెండో భార్య గౌత‌మి అని అంద‌రికి తెలిసిందే. క‌మ‌ల్ మొద‌టి భార్య కుమార్తెలు అయిన అక్ష‌ర‌,శృతిహాస‌న్‌కు గౌత‌మికి మ‌ధ్య మొద‌టి నుండి గొడ‌వ‌లు అనేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.శృతిహాస‌న్‌కు గౌత‌మికి అస‌లు ప‌డ‌ద‌నేది ఇండ‌స్ట్రీ టాక్‌.వీరిద్ద‌రి వ‌ల్ల క‌మ‌ల్ న‌లిగిపోయార‌ని చాలా మంది అభిప్రాయం.తాజాగా సోష‌ల్‌ మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు చెప్పింది.పెళ్లి ఎప్పుడన్న ప్రశ్నకు సమాధానం తన వద్ద లేదని, ఏదేమైనా తన అభిప్రాయానికి ఇంట్లోని వారందరూ విలువను ఇస్తారని తెలిపింది.

ఇక తండ్రి ఆహ్వానిస్తే రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, అవగాహన లేకుండా తాను రాజకీయాల్లోకి వెళ్లబోనని, సమాజానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి, రాజకీయ పరిజ్ఞానం పెరిగిన తరువాత ఆలోచిస్తానని వ్యాఖ్యానించింది. తన జీవితంలో గౌతమి అనే మహిళ లేనేలేదని హీరోయిన్ శ్రుతిహాసన్ పేర్కొంది.మైఖేల్ కోర్సలేతో ఉన్న పరిచయంపై మాట్లాడుతూ, తను స్నేహితుడు మాత్రమేనని, ఆ విషయంపై అంతకన్నా ఏమీ చెప్పలేనని అంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -