Saturday, May 4, 2024
- Advertisement -

నా భర్త అంత నీచమైన పని చేయడు – గీతామాధురి

- Advertisement -

టాలీవుడ్లో రెండు నెలల క్రితం డ్రగ్స్ ఎలా సంచలనం రేపిందో అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ కేసులో గాయని గీతా మాధురి భర్త.. నటుడు నందు కూడా చిక్కుకున్న విషయమ్ అందరికి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించి ఫోలీసుల నోటీసులందుకున్న నందు.. విచారణకు కూడా హాజరైయ్యాడు.

ఈ కేసుతో తనకెలాంటి ప్రమేయం లేదంటూ అప్పట్లో మీడియా ముందుకొచ్చి తెలిపాడు. కావలంటే డ్రగ్స్ టెస్టు చేయించుకోవడానికి కూడా తాను రెడీ అని తెలిపాడు. అయితే తన భర్త విషయంలో గీతా మాధురి ఏమనుకుంటుందన్నది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇదే విషయంపై గీతా ఓపెనైంది. తన భర్త మీద తనకు పూర్తి నమ్మకం ఉందని.. అతను దారి తప్పలేదని.. నీచమైన పనులు చేయడని అమె తెలిపింది. డ్రగ్స్ కేసులో తన భర్త పేరు టీవీలో రావడం చూసి.. కుటుంబ సభ్యులందరం షాక్ అయ్యాం అని గీతా తెలిపింది. తన భర్తకు డ్రగ్స్ అలవాటు లేదని.. అతను డ్రగ్స్ తీసుకునేంత దారి తప్పలేదని అంది.

నందును డ్రగ్స్ కేసులో విచారణకు పిలిచినపుడు ఎలా ఫీలయ్యారని అడిగితే.. నందూ ఎలాంటివాడో తనకి పూర్తిగా తెలుసని .. తన దగ్గర అతను ఏ విషయాలూ దాచడని చెప్పింది. నందుపై తనకి పూర్తి నమ్మకం ఉండటం వల్ల విచారణ విషయంలో ఏమీ భయపడలేదని చెప్పింది. ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికి నందు పేరు ఈ కేసులో వినిపించడం తన అత్తంటి వారిని బాధించిందని ఆమె తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -