Monday, May 13, 2024
- Advertisement -

జబర్ధస్త్ లో చేయడంపై హరితేజ స్పందన ఇదే

- Advertisement -

బిగ్ బాస్ షోలో చాలా మంది పాల్గొన్నారు. అందరు మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రధానంగా బిగ్ బాస్ షోలో మంచి ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకుంది హరితేజ. ఈ మధ్య ‘జబర్దస్త్‌’ యాంకర్ గా హరితేజను తీసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వచ్చాయి. రష్మి గౌతమ్‌కి బదులుగా హరితేజని తీసుకున్నారనే రూమర్స్ వినిపించాయి.

అయితే ఈ మధ్య దసరా ఉత్సవాలకి యాంకర్‌ అవతారం ఎత్తడంతో హరితేజ ఇక టీవీ రంగంలో బిజీ అవుతుందనే అనుకుంటున్నారు. అయితే జబర్దస్త్‌ షోకి మాత్రం ఆమెని ఎవరూ సంప్రదించలేదట. ఈ కామెడీ షోకి కమెడియన్లు చేసే స్కిట్లు ఎంత హిట్టో అనసూయ, రష్మిల గ్లామర్‌ కూడా అంతే ఎస్సెట్టు. హరితేజ ఎంటర్‍టైనర్ కావచ్చునేమో కానీ గ్లామర్ పరంగా ఆమె అంతగా స్కోర్ చేయలేదు. టాప్ రేటింగ్స్ వచ్చే జబర్ధస్త్ షోకి ఇప్పుడు మార్పులు చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి హరితేజను ఈ షోకి తీసుకోవడం లేదని ఖరాఖండీగా తెలిపింది.

కాకపోతే హరితేజకి తొందర్లో కొన్ని ప్రముఖ షోలు చేతికి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా సుమ లాంటి సీనియర్లు హోస్ట్‌ చేసే కార్యక్రమాలని ఆమె చేతికి ఇచ్చేయవచ్చు. బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ ని సినీ రంగంలో కూడా వాడుకోవాలని చూస్తోంది. కానీ ప్రస్తుతం ఆమెకి సినిమాల్లో అంత చెప్పుకోతగ్గ ఆఫర్లు వస్తున్న దాఖలాలు లేవు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -