Thursday, March 28, 2024
- Advertisement -

తన భర్తకు డ్రగ్స్ తో అసలు లింక్ లేదంటున్న గీతామాధురి

- Advertisement -

డ్రగ్స్ విషయంలో టాలీవుడ్ షేక్ అవుతోంది. డ్రగ్స్ విషయంలో సంబంధాలు ఉన్న పలువురు సినీ ప్రముఖులు వీరే అని.. మీడియా సంస్థలు బయటపెట్టాయి. అయితే.. మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం డ్రగ్స్ తో సంబంధం ఉందంటూ నోటీసులు వచ్చినట్లుగా చెబుతున్న వారికి సంబంధించి.. వారి కుటుంబ సభ్యులు ఇప్పుడే నోరు విప్పుతున్నారు. ఇలా గొంతు విప్పిన మొదటి సెలబ్రిటీ గాయని గీతామాధురి. డ్రగ్స్ ఉదంతంలో నోటీసులు అందుకున్న డర్టీ డజన్ లో గీతామాధురి భర్త నందు కూడా ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. తన భర్త నందుకు డ్రగ్స్ కు సంబంధం లేదని.. అతను డ్రగ్స్ కు తీసుకునేంతగా దారి తప్పలేదని ఆమె అన్నారు. డ్రగ్స్ ముఠాతో నందూకి ప్రమేయం ఉన్నట్లుగా వస్తున్న వార్తల్ని ఆమె తప్పు పట్టి.. ఖండిచారు. ఇక ఇదే విషయంపై నందు మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకు డ్రగ్స్ ను చూడలేదని.. అలాంటిది తన పేరు మీడియాలో రావటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. డ్రగ్స్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని.. కావాలంటే ఏ పరీక్షకైనా తాను సిద్ధమన్నారు. తనను ఈ కేసులో ఇరికించే ఉద్దేశంతోనే ఇలా చేసి ఉంటారన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మీడియా తొందరపాటుతో వ్యవహరించే కన్నా.. వాస్తవాలు తెలుసుకొనొ బయటకు తీసుకొస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి డ్రగ్స్ సంబంధించిన పర్వం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -