Thursday, May 9, 2024
- Advertisement -

వ‌రాల జ‌ల్లులు కురిపించిన సీఎం చంద్ర‌బాబు

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక స‌మ‌రం మ‌రింత రంజుగా మారింది. ఎన్నిక‌లో ఎలాగైనా గెల‌వాల‌ని అధికార పార్టీ నియేగ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఎప్పుడూలేని తాయిలాల‌ను ప్ర‌క‌టించింది. ఏకంగా సీఎం చంద్ర‌బాబు దీన్ని స‌వాల్‌గా తీసుకోవ‌డంతో ప్ర‌జ‌ల‌మీద వ‌రాల‌జ‌ల్లు మొద‌ల‌య్యింది.రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లో ‘ఎన్టీఆర్ నగర్’ల నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, పక్కా ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని ఆయన అధికారుల‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా నంద్యాల 800 కోట్ల బంపర్ ఆఫర్ ‘ఎన్టీఆర్ నగర్’ ప్రకటించారు. పట్టణంలో ఈ ఇళ్ల కోసం 3 చోట్ల కేటాయించిన 120 ఎకరాల భూమి విలువే రూ.250 కోట్లు ఉంటుందన్నారు.
నంద్యాల న‌యేజ‌క‌వ‌ర్గంలోనిలబ్దిదారులకు ఇచ్చే సబ్సిడీ విలువ రూ.400 కోట్లు ఉంటుందని, ఆప్రాంతాలలో ప్రభుత్వం నిర్మించే రోడ్లు, తాగునీరు, విద్యుత్, పార్కుల అభివృద్ది, ఇతర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ విలువ రూ.150 కోట్లు పైబడి ఉంటుందని చెప్పారు.
అదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోని పట్టణ ప్రాంతాలలో భారీఎత్తున ఎన్టీఆర్ నగర్ ల అభివృద్ది, పక్కా ఇళ్ల నిర్మాణాన్ని ఈ రెండేళ్లలో శరవేగంతో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.ఈ టెలికాన్ఫరెన్స్ లో అర్భన్ హవుసింగ్ శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ, మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఇతర మంత్రులు, పట్టణాభివృద్ది శాఖ కార్యదర్శి కరికాల వలవన్, జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ ఛైర్మన్లు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -