Friday, May 17, 2024
- Advertisement -

ఇదిగో ఈమెనే సోనియాగాంధీ

- Advertisement -

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జీవిత ఆధారంగా ‘ది యాక్సిడెంటల్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ చిత్రం తెరకెక్కుతున్న సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే.అనుపమ్‌ కేర్‌ ఈ సినిమాలో డా.మన్మోహన్‌ సింగ్‌గా కీలక పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే.కీలక పాత్ర అయిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీగా ఎవరు చేస్తున్నార‌ని ఆశ‌క్తి నెల‌కొంది.ఈ ఉత్కంఠకు తెరదించుతూ సోనియా గాంధీగా తాను బిగ్‌ స్క్రీన్‌పై నటిస్తున్నట్టు జర్మన్‌ నటి సుజానే బెర్నెర్ట్‌ ట్విటర్‌లో ధృవీకరించారు.

ఈమె జ‌ర్మ‌న్ అయిన‌ప్ప‌టికి హిందీ బాగా మాట్లాడ‌గ‌ల‌ర‌ని తెలుస్తుంది,ఎందుకంటే ఈమె నటుడు అఖిల్‌ మిశ్రాను పెళ్లి చేసుకున్నారు.హిందీతో పాటు బెంగాలీ, మరాఠి, భాష‌లు కుడా బాగా వ‌చ్చునని తెలుస్తుంది.పలు భారతీయ సినిమాల్లో, పలు భాషల టీవీ షోల్లో నటించింది.విజయ్‌ గుట్టే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనుపమ్‌ ఖేర్‌తో పాటు అక్షయ్ ఖన్నా కూడా నటిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -