Thursday, May 2, 2024
- Advertisement -

ఐపీఎల్‌ చెన్నై మ్యాచ్‌లకు కావేరిజ‌లాల బోర్ట్ దెబ్బ‌…

- Advertisement -

చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కావేరీ జలాల కేటాయింపులో అన్యాయం జరిగిందని, వెంటనే కావేరీ జలమండలి ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో తమిళనాడు రాష్ట్రం అట్టుడుకుతోంది. మరోవైపు అధికార, విపక్షాలతో పాటు పలు ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. ఈ నేపథ్యంలో చెన్నైలో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్‌లపై అనుమానాలు నెలకొన్నాయి. అంతేకాకుండా చెన్నైలో ఐపీఎల్‌ను నిషేదించాలని రాజకీయ పక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

తమిళగ వాళ్వురిమై కట్చి(టీవీకే) పార్టీ నేతలు ఏకంగా చెన్నైలో ఐపీఎల్‌ మ్యాచ్‌లను నిలిపివేయాలని ఆ నగర పోలీస్‌ కమీషనర్‌కు వినతి పత్రం అందజేశారు. కావేరి జలమండలి ఏర్పాటు చేసే వరకు మ్యాచ్‌లను నిలిపివేయాలని కోరామని, ఒక వేళ మ్యాచ్‌లు నిర్వహిస్తే అడ్డుకొని తమ నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు. దీంతో చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌డంపై అనుమానాలు త‌లెత్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -