లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలు ఎదుర్కొనడం.. కోర్టు ఏ శిక్ష విధిస్తుందోనని ఆందోళనతో ఓ హాలీవుడ్ నటుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అమెరికాలో (జనవరి 30) మంగళవారం చోటుచేసుకుంది. అమెరికన్ నటుడు మార్క్ సాలింగ్ (35) తన నివాసంలో తెల్లవారుజామున ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని అతడి తరఫు న్యాయవాది మైఖెల్ ప్రోక్టార్ వెల్లడించారు. గ్లీ వంటి టీవీ సిరీస్‌లలో నటించి మంచి గుర్తింపు పొందాడు.
అయితే 2015లో సాలింగ్‌పై లైంగిక వేధింపులు, చైల్డ్ పోర్నోగ్రఫీ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలతో సాలింగ్‌ను పోలీసులు 2016లో అరెస్టు చేశారు. అనంతరం చార్జిషీట్ ఫైల్ చేశారు. అతడి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకోగా అందులో దాదాపు 50 వేల చైల్డ్ పోర్నోగ్రఫిక్ ఫొటోలు, వీడియోలు ఉండడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో నటుడు సాలింగ్ ఆందోళనలో పడ్డాడు. వాదోపవాదాలు పరిశీలించి అతడు దోషి అని కోర్టు నిర్ణయించింది. ఈ మార్చి 7వ తేదీన శిక్ష ఖరారు చేయాల్సి ఉంది. అయితే వీటన్నిటికి భయపడి ఆందోళనతో సాలింగ్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అందరినీ కలచివేసింది. గత ఆగస్టులో (2017)లో కూడా ఓసారి ఆత్మహత్యాయత్నానికి సాలింగ్ పాల్పడ్డాడు కూడా. చివరికీ రెండో ప్రయత్నంలో ఆత్మహత్యను విజయవంతంగా చేసుకున్నాడు.