Wednesday, May 8, 2024
- Advertisement -

హాలీవుడ్ ఎంట్రీకి ప్రభాస్ సిద్ధమవుతున్నాడా ?

- Advertisement -

పాన్ ఇండియా హీరో ప్రభాస్ త్వరలో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడా ? ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఇందుకోసం సంప్రదించిందా ? ఇప్పుడిదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్‌తో ప్రభాస్ అభిమానులను పలుకరించాడు. త్వరలో ఆదిపురుష్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇక సలార్, ప్రాజెక్టు కే సెట్స్‌పై ఉన్నాయి. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ మూవీ షూటింగ్ సైతం త్వరలో మొదలుకానుంది.

ఒకవైపు పాన్ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతున్న ప్రభాస్‌కు హాలీవుడ్‌ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. సూపర్ హీరో మూవీ కోసం ప్రపంచ ప్రఖ్యాత ప్రొడక్షన్స్ హౌస్ యూనివర్సల్ స్టూడియోస్ అతడిని సంప్రదించినట్లు సమాచారం. ప్రభాస్ సైతం హాలీవుడ్ ఎంట్రీ కోసం ఉత్సాహంగా ఉన్నాడట. బాహుబలి సిరీస్ తో ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ క్రేజ్ తో ప్రభాస్ యూనివర్సల్ స్టూడియోస్ సినిమాలో నటించబోతున్నాడు. స్పైడర్ మేన్, బ్యాట్ మేన్, లాంటి సూపర్ హీరో సినిమాలకు ఉన్న క్రేజ్ ఏంటో తెలిసిందే. మరి నిజంగా ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడో లేదో తెలియాంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

కేజీఎఫ్ -2కు మాటలు రాసిన స్టార్ హీరో

ఐటమ్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా?

క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -