Thursday, May 16, 2024
- Advertisement -

గోన గన్నా రెడ్డి నా కోసం రాసింది కాదు – బన్నీ

- Advertisement -

రుద్రమ దేవి సినిమా విడుదల కి సరిగ్గా ఒకే ఒక్క రోజు ఉంది, ఈ సమయం లో ప్రమోషన్ ల విషయం లో చాలా బిజీ గా ఉన్నారు చిత్ర బృందం. డైనమిక్ డైరెక్టర్ గుణ శేకర్ దగ్గర నుంచి ఈ సినిమా లో ప్రధాన పాత్రధారి అనుష్క, రానా, అల్లూ అర్జున్ వరకూ అందరూ గోన గన్నా రెడ్డి క్యారెక్టర్ ని హై లైట్ చెయ్యడానికి చూస్తున్నారు. ఈ సినిమా విషయం లో ఇంటర్వ్యూ లు మీద ఇంటర్వ్యూ లు ఇచ్చేస్తున్న బృందం తాజాగా అల్లూ అర్జున్ ని విడుదల ముందు రోజు రంగం లోకి దింపింది.ఈ సినిమా మీద ఎలాంటి క్యూరియాసిటీ ఉంది అని అడిగితే తెలుగు సినిమాకి ఇదో కొత్త జోనర్.

హిస్టారిక్ బయోగ్రాఫిక్ జోనర్ ఫిలిం ఇది. బయో ఎపిక్ అనాలి. ప్రేక్షకులు ఎలా యాక్సెప్ట్ చేస్తారు అన్న క్యూరియాసిటీ ఉంది. అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ. 

గోన గన్నా రెడ్డి క్యారెక్టర్ ఎవ్వరూ ఇంకా ఓకే చెప్పలేదు అనుకుంటున్న సమయం లో తనకి తాను గా గుణ శేకర్ ని అనుకోకుండా కలిసిన సమయం లో నారేట్ చేసారు అని ఆ సమయం లో అది బాగా నచ్చింది అని తనకి తగ్గట్టు గా కథ మార్చమని కోరాను అని వెంటనే ఆ పని చెయ్యడానికి గుణ ఆసక్తి చూపించడం తో ఆ క్యారెక్టర్ తానే చెయ్యాలి అనిపించింది కాబట్టి చేశా అంటున్నాడు బన్నీ. ఇందులోకి ఓ మంచి ఇంటెన్షన్ తో దిగాను. నిజానికి ఒరిజినల్ గా గోనగన్నారెడ్డి క్యారెక్టరైజేషన్ నాకోసం రాసినది కాదు. వేరే ఏజ్ గ్రూప్కి రాసుకున్నది. 

నేనొక యంగ్ హీరోని.  నాకు తగ్గట్టు క్యారెక్టర్, డయలాగు లూ మార్చేసి నాకు పక్కగా సూట్ అయ్యేలా రాసారు గుణ అంటున్నాడు బన్నీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -