Friday, May 10, 2024
- Advertisement -

13 ఏళ్ళ పాపతో రికార్డింగ్ డాన్సులు

- Advertisement -

విజయవాడ సిటీ లో దారుణం జరిగింది. చిన్న చిన్న ఆడపిల్లలతో రికార్డింగ్ డాన్సులు చేయ్యించడమే కాకుండా వారితో వ్యభిచారం కూడా చేయిస్తున్న నలుగురుని కమీషనరేట్ పరిథి లో ఉన్న రూరల్ పోలీసులు అరస్ట్ చేసారు .

నిందితుల్లో ఒక బాలిక తల్లి తో పాటు ఆమె ని ముఠా కి పరిచయం చేసిన మహిళ ఉన్నారు. వైజాగ్ కి చెందినా బ్రోకర్లు ఇద్దరు పోలీసుల అదుపులో ప్రస్తుతం ఉన్నారు.

 విజయవాడ కి చెందిన వాంబే కాలనీ లోని శివకుమారి ఆర్ధిక ఇబ్బందులు పడుతూ ఉండగా పక్కింటి హుస్సేన్ బీ వైజాగ్ లో రికార్డింగ్ డాన్సులు చెయ్యడం కోసం తన కూతురుని పంపమని డబ్బు బాగా ఇస్తారు అని చెప్పింది. వెంటనే బ్రోకర్లని అడ్డంగా పెట్టుకుని అనకాపల్లి కి చెందినా సన్యాసిరావు వద్దకు పంపి వినాయక చవితి సందర్భంగా రికార్డింగ్ డాన్సులు చెయ్యడం కోసం కూతురు ని పంపించారు.

 వారు ఆ పాపతో డాన్సులతో సరిపెట్టకుండా బలవంతంగా వ్యభిచారం చేయించారు. దసరా మహోత్సవాల కోసం మళ్ళీ బాలికను రమ్మని బలవంత పెట్టగా ఆమె రూరల్ సి ఐ ని కలిసింది. ప్రస్తుతం బాలిక వసతి గృహం లో ఉంది. పాప వయసు 13 ఏళ్ళు గా చెబుతున్నారు 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -