Tuesday, May 14, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ఫాన్స్ కి పండగే!

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాడు. కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా ఫుల్ ఫామ్ లో దుమ్ము రేపుతున్న ఎన్టీఆర్ టెంపర్, నాన్నకుప్రేమతో విజయాల తరువాత హాట్రిక్ కొట్టడానికి సిద్ధమవుతున్న సినిమా జనతాగ్యారేజ్ ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ లుక్ టీసర్ విడుదల తేదీలను అనౌన్స్ చేసింది జనతాగ్యారేజ్ టీం.

ఒక్క రోజే రెండు పండగలను జరుపుకోవడం కుదరదు కాబట్టి ఎన్టీఆర్ రెండు తేదిల్లో ట్రీట్ ఇవ్వబోతున్నాడు. మొదటగా తన పుట్టినరోజు అయినా మే 20 సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నాడట, ఆ తరువాత తన తాత సీనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 28 న సినిమా ఫస్ట్ లుక్ టీసర్ ని రిలీజ్ చేయబోతున్నారట.

ఎన్టీఆర్ సరసన సమంత-నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో మోహన్ లాల్-ఉన్ని ముకుందన్ కీలకపాత్రలు పోషించబోతున్నారు, మరో రెండు నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకోబోతున్న ఈ సినిమాను ఆగస్టు 12 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -