Monday, May 20, 2024
- Advertisement -

మరొక హాట్ డర్టీ పిక్చర్ తో రాబోతోంది

- Advertisement -

కెరీర్ మొదట్లో క్లాస్ రోల్స్ చేసి హిట్స్ కొట్టినా పెద్దగా క్రేజ్ దక్కించుకోలేని భామ విద్యాబాలన్ తరువాత తనకున్న ఇమేజ్ ను మార్చుకోవాలని విద్యాబాలన్ డెడ్ ఇష్కియా అనే ఆఫ్ బీట్ సినిమాలో హీరో హర్షద్ వార్షీ తో కలిసి హాట్ లిప్ లాక్ సీన్ తో సెగలు పుట్టించింది. తరువాత ఏకంగా డర్టీ పిక్చర్ లో తన విశ్వరూపం చూపించి ఏకంగా నేషనల్ అవార్డు గెల్చుకుంది.

ఆ సినిమాతో 10 బ్లాక్ బస్టర్ సినిమాలకు వచ్చేంత పాపులారిటీని సొంతం చేసుకున్న విద్యాబాలన్ తరువాత ఒకటి రెండు హిట్లు కొట్టినా మళ్ళీ డర్టీ పిక్చర్ లాంటి హాట్ అండ్ సెక్సీ సినిమాను చేయలేదు. ఇక పెళ్లి కూడా చేసుకున్న అమ్మడు ఇప్పుడు సినిమాలు చేస్తున్న అన్నీ క్లాస్ సినిమాలే అవ్వడంతో ఆమె అభిమానులు తెగ భాదపడుతున్నారు.

దాంతో మనసు మార్చుకున్న అమ్మడు రీసెంట్ ఓ గుజరాతి వేశ్య రోల్ లో కనిపించబోతున్నట్లు చెప్పింది, ఇప్పుడు మరో హాట్ సినిమాను ఒప్పుకుందట విద్యా. బేగం జాన్ అనే రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో శృంగారపాత్రను చేయబోతున్నట్లు చెబుతున్నారు. దాంతో ఇప్పుడు ఆమె ఫాన్స్ ఈ సినిమాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -