Saturday, May 4, 2024
- Advertisement -

రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి బర్త్‌ డే ట్రీట్ రెడీ!

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23న అని అందరికి తెలిసిందే. ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా తమ అభిమాన హీరో బర్త్‌ డే గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. ఇక ముఖ్యంగా ప్రసాద్ ఐ మ్యాక్స్‌లో 100 అడుగుల ప్రభాస్‌ కటౌట్ పెట్టనున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సలార్ మూవీ నుండి అదిరే అప్‌డేట్ రానున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంచితే ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోండగా రెబల్ స్టార్ బర్త్ డే సందర్భంగా ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఛత్రపతిని విడుదల చేయనున్నారు. 4Kలో రిలీ జ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రభాస్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన చిత్రం ఇది. రాజమౌళి – ప్రభాస్ కాంబోలో వచ్చిన ఈ మూవీ ఆల్ టైం హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. యాక్షన్ సీన్స్, సెంటిమెంట్‌,ఎమోషన్, సాంగ్స్ అన్ని కలగలిపి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది.

ఇక ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకురానుంది. రెండుపార్టులుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. దీంతో నాగ్ అశ్విన్‌తో కల్కి 2898 AD, మారుతితో రాజా డీలక్స్ సినిమాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -