Tuesday, April 30, 2024
- Advertisement -

చంద్రబాబుకు గుడ్‌ ఫ్రైడే అవుతుందా?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇవాళ బిగ్ ఫ్రైడే కానుందా…?ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో బాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం ఏ విధమైన తీర్పునిస్తుంది. ఇప్పుడు ఇదే టీడీపీ వర్గాల్లో టెన్షన్‌గా మారింది. ఇక బాబు క్వాష్ పిటిషన్‌తో పాటు ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్‌పై సుప్రీంలో విచారణ జరగనుంది. క్వాష్ పిటిషన్‌ కేసులో ఇరు పక్షాల వాదనలు పూర్తి కాగా తీర్పును రిజర్వ్ చేసింది న్యాయస్థానం. ఇవాళ తీర్పు రానుండగా అటు టీడీపీ..ఇటు నారా ఫ్యామిలీలో ఉత్కంఠ నెలకొంది.

ఇక బాబు అనుకూల మీడియాలో చంద్రబాబుకు మద్దతుగా చేయాల్సిందంతా చేస్తున్నారు. ఎఫ్‌ఐఆర్ లేదు, సాక్ష్యం లేదు కానీ రాజమండ్రి జైలులో రిమాండ్‌లో చంద్రబాబు ఉన్నారని సింపతిని మరింత పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చంద్రబాబుపై మొత్తం నాలుగు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 17ఏ కింద కేసును పరిగణలోకి తీసుకుంటే, బాబు ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉన్న పదవీకాలానికి సంబంధించిన అంశం కావడంతో అన్ని కేసుల్లో ఉపశమనం లభిస్తుంది.

ప్రధానంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు 17ఏతో పాటు ఆయన భద్రతా, ఆరోగ్యం వంటి అంశాలనే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ప్రభుత్వ డాక్టర్లపై నమ్మకం లేదని చంద్రబాబు వ్యక్తిగత లాయర్లతో హెల్త్ చెకప్ చేయించాలని న్యాయమూర్తిని కోరారు. అటు సీఐడీ తరపు న్యాయవాదులు గట్టిగా తమ వాదనలు వినిపిస్తుండటంతో చంద్రబాబు రిమాండ్‌ 40 రోజులు దాటింది. నాలుగోసారి బాబు రిమాండ్‌ను నవంబర్ 1 వరకు పొడగించడంతో ఇవాళ సుప్రీం కోర్టు..బాబు క్వాష్ పిటిషన్‌పై ఇచ్చే తీర్పు కీలకం కానుంది. ఒకవేళ తీర్పు అనుకూలంగా రాకపోతే బాబుకు మరిన్ని రోజులు జైలు జీవితం తప్పదని అంతా భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -