Sunday, April 28, 2024
- Advertisement -

లోకల్..నాన్‌లోకల్..బీజేపీలో కొత్త చిక్కు!

- Advertisement -

తెలంగాణ బీజేపీలో కొత్త చిక్కు వచ్చి పడింది. బీజేపీ అధిష్టానం తెలంగాణలో 10 సీట్లే టార్గెట్‌గా కార్యాచరణ సిద్ధం చేయగా లోకల్ బీజేపీలో మాత్రం కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రధానంగా మల్కాజ్‌గిరి స్థానం నుండి పోటీ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు లీడర్లు. లోకల్, నాన్ లోకల్ అంటూ స్థానికులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక మల్కాజ్‌గిరి పార్లమెంట్ నుండి ఈటల రాజేందర్ కు సీటు ఇచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండగా స్థానిక నేతలు తీవ్రస్థాయిలో విభేదిస్తున్నారు. ఈటలతో ఆపటు కూన శ్రీశైలం గౌడ్, చాడ సురేష్ రెడ్డి, పన్నాల హరీష్ రెడ్డి, మురళీధరరావు, మల్క కొమురయ్య ప్రధానంగా రేసులో ఉన్నారు. అయితే ఇందులో నియోజకవర్గంతో సంబంధంలేని ఈటలకు సీటు ఎలా ఇస్తారని కూన శ్రీశైలం వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రెండుచోట్లా ఓడిపోయిన ఈటలకు మళ్ళీ ఇపుడు మల్కాజ్ గిరి సీటు ఎలా ఇస్తారి ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఈటలకు సీటు తామే ఓడిస్తామని అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారు బీజేపీ నేతలు. దీంతో తెలంగాణలో పెద్ద ఎత్తున సీట్లు గెలిచి సత్తాచాటాలని భావిస్తున్న బీజేపీ నేతలు ఇప్పుడు తల పట్టుకునే పరిస్థితి వచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -