- Advertisement -

నిమ్మరసం… ప్లస్, మైనస్ ఇదే?

- Advertisement -

రోజు పరగడపనే నిమ్మరసం తాగే అలవాటు ఉందా?, అయితే మీరు ఆరోగ్య వంతులే. ప్రతీరోజు పరిగడపునే నిమ్మరసం తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. కాలేయం శుభ్రపడటంతో పాటు పనితీరు మెరుగుపడుతుంది. ఆహారం సులభంగా జీర్ణమై మలబద్దకం సమస్య తగ్గిపోతుంది.

నిమ్మ రసం రక్తంలో త్వరగా కలిసిపోయి అన్ని అవయవాలు చరుగ్గా పనిచేసేలా చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కీళ్ళనొప్పులను తగ్గిస్తుంది. వేసవి కాలంలో వేడి నుండి ఉపశమనం పొందడానికి నిమ్మకాయ నీటిని ఎక్కువగా తీసుకుంటారు.

అలాగే బరువును నియంత్రించటంలో సహాయపడుతుంది.అయితే ఏది అతి అయినా అనర్థానికి దారి తీస్తుంది. అందుకే లెమన్ వాటర్ మోతాదుకు మించి విచక్షణారహితంగా తాగుతున్నవారు దుప్ఫ్రభావాల బారిన పడే అవకాశం ఉంది. నిమ్మకాయ నీటిని అధికంగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది.

నిమ్మ రసం తరుచూ తాగుతుంటే అధిక మొత్తంలో విటమిన్ సీ రక్తంలో ఐరన్ స్థాయిని పెంచుతుంది. ఎక్కువగా తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. అలాగే నిమ్మకాయ నీటిని ఎక్కువగా తీసుకుంటే అది గొంతు నొప్పికి కారణమవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -