Wednesday, May 8, 2024
- Advertisement -

‘గూడ‌చారి’ మూవీ రివ్యూ

- Advertisement -

కెరీర్ స్టార్టింగ్‌లో చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసుకుంటు వ‌స్తున్నాడు అడివి శేష్ .కొన్నాళ్లు న‌టుడిగా గ్యాప్ తీసుకున్న అడివి శేష్ ‘క్ష‌ణం’ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి మెప్పించాడు.ఈ సినిమా అడివి శేష్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.తాజాగా ఆయ‌న న‌టించిన సినిమా ‘గూఢచారి’. ఈ సినిమాకు క‌థ‌ను కూడా అడివి శేష్ అందించ‌డం విశేషం.సినిమా ట్రైల‌ర్‌,టీజ‌ర్‌తోనే అందరి దృష్టి ఆక‌ర్షించింది గూడ‌చారి.ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో అడివి శేష్ కు ఎలాంటి హిట్ దక్కిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ: దేశాన్ని కాపాడడం కోసం మన ప్రభుత్వం త్రినేత్ర అనే మిషన్ ను చేపడుతుంది. సైనికులు సరిహద్దుల్లో మాత్రమే కాకుండా దేశం లోపల కూడా ఉండి ప్రజలను, ప్రభుత్వాన్ని కాపాడాలనేది దీని ముఖ్య ఉద్దేశం. అయితే దీనికి సంబంధించిన వివరాలు ప్రత్యర్థులకు లీక్ అవ్వడంతో వెంటనే మిషన్ ను ఆపేస్తారు. త్రినేత్ర మిషన్ లో ఉన్న వ్యక్తులే ఈ వివరాలు బయటకు అందించారని సీక్రెట్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ క్రమంలో రఘువీర్ అనే ఆఫీసర్ చనిపోతాడు. అతడి కొడుకు అర్జున్(అడివిశేష్) చిన్నపిల్లాడు కావడంతో అతడి ప్రాణాలకు కూడా ముప్పు ఉంటుందని అతడి మావయ్య సత్య(ప్రకాష్ రాజ్) తన ఐడెంటిటీని మార్చేస్తాడు. పెద్దయిన తరువాత అర్జున్ తన తండ్రిలానే దేశానికి సేవ చేయాలనుకుంటాడు. రా(ఇంటెలిజెన్స్ బ్యూరో)లో జాయిన్ కావాలనేది అతడి కల. అనుకున్నది సాధిస్తాడు కూడా.. చాలా ఏళ్ల క్రితం ఆపేసిన త్రినేత్ర మిషన్ ను మళ్లీ తిరిగి ఆరంభించాలనేది ప్రభుత్వం ప్లాన్. అందులో భాగంగానే అర్జున్ ని ఎంపిక చేస్తారు.అర్జున్ త్రినేత్ర మిషన్‌ను ఎలా పూర్తి చేస్తాడ‌నేదే మిగిలిన క‌థ‌.

విశ్లేషణ: ఇండియన్ సినిమాల్లో జేమ్స్ బాండ్ తరహా కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. ‘గూఢచారి’ ఆ నేపథ్యంలో రూపొందించిన కథే.. స్పై థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా యాక్షన్, సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే ఆడియన్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. సినిమా మొదలైన కొద్దిసేపటికి ఏదో సాగుతుందిలే అనుకుంటాం.. కానీ మెయిన్ ప్లాట్ లోకి డైరెక్టర్ ఎంటర్ అయిన దగ్గర నుండి కథ ఊపందుకుంది. సినిమాలో ప్రతి క్యారెక్టర్ కథలో కీలక భాగంగా మారాయి. హీరో ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరడం, అక్కడ ట్రైనింగ్ తీసుకునే విషయాలు రియలిస్టిక్ గా అనిపిస్తాయి. ఇటువంటి సీరియస్ కథ మధ్యలో లవ్ స్టోరీ ఏంటి..? ఈ రొమాన్స్ ఏంటని..? ఆడియన్స్ అనుకునేలోపు హీరోయిన్ అసలు ఎందుకు అతడిని ప్రేమించాల్సి వచ్చిందనే విషయాలు షాకింగ్ గా అనిపిస్తాయి. కానీ ఆ పాత్రను ఎక్కువసేపు తెరపై ఉంచకుండా ఇంటర్వెల్ సమయానికి ఎండ్ చేసేశారు. అసలు అర్జున్ ని ప్రత్యర్ధులు ఎందుకు టార్గెట్ చేశారనే విషయాలు ప్రీక్లైమాక్స్ వరకు రివీల్ చేయలేదు.

న‌టీన‌టులు: హీరో అడివి శేష్ హీరోగా చక్కటి నటన కనబరిచారు. యాక్షన్ సీన్స్ లో బాగా నటించాడు. ఎమోషన్ సీన్స్ లో ఇంకాస్త పరిణితి కనబరిచి ఉంటే బాగుండేది. హీరోయిన్ శోభిత నటిగా ఆకట్టుకున్నా, లుక్స్ పరంగా మాత్రం పెద్దగా మెప్పించదు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. జగపతిబాబు కోసం రాసుకున్న ట్రాక్ ఆడియన్స్ కు థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు జగపతిబాబు. మధుశాలినికి చాలా కాలం తరువాత మంచి పాత్ర దక్కిందని చెప్పాలి.యాక్షన్ సీన్స్ లో సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రకాష్ రాజ్, అనీష్ కురివెళ్ల వంటి తారలు తమ పరిధుల్లో బాగా నటించారు. వెన్నెల కిషోర్ పాత్రకి కామెడీతో పాటు ఓ ట్విస్ట్ కూడా పెట్టడం బాగుంది. నటీనటులు తమ పెర్ఫార్మన్స్ తో కథకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు :అడివిశేష్ రాసిన కథను తన టేకింగ్ తో శశికిరణ్ మరోస్థాయికి తీసుకెళ్లాడు. హాలీవుడ్ సినిమాలు చూసేవారికి ఈ కథ సాదాసీదాగా అనిపించినా.. తెలుగు ఆడియన్స్ ను మాత్రం థ్రిల్ కి గురిచేస్తుంది. అయితే విలన్ నేపధ్యం ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బాగుండేది. బాండ్ కథకు సెంటిమెంట్, ఎమోషన్ జోడించడం కూడా బాగుంది. సాంకేతికంగా మంచి క్వాలిటీతో సినిమాను రూపొందించారు. శనీల్ కెమెరా వర్క్ సినిమాకు మరో అసెట్. శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమా నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ ఫిలింగ్ ఆడియన్స్ కి కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. టెక్నికల్ వర్క్ పరంగా దేనికి వంక పెట్టలేని విధంగా రూపొందించారు. ఈ వారంలో విడుదలైన మూడు చిత్రాల్లో గూఢచారి తన సత్తా చాటడం ఖాయం.

బోట‌మ్ లైన్: హాలీవుడ్ రేంజ్‌లో క‌నిపించే టాలీవుడ్ మూవీ.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -