Saturday, May 18, 2024
- Advertisement -

ఆ నిర్మాత‌తో ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్?

- Advertisement -

ఆర్ఎక్స్ 100 సినిమాతో స్టార్ హీరోయిన్‌తో స‌మానంగా ఇమేజ్ సొంతం చేసుకుంది హీరోయిన్ రాజ్‌పుత్ పాయల్ .అమ్మడు అందాల‌కు టాలీవుడ్ ఫిదా అయింది.చిన్న సినిమాగా వచ్చిన ఆర్ఎక్స్ 100 పెద్ద హిట్‌గా న‌టిచిన సంగ‌తి అంద‌రికి తెలిసిందే.అసలు సినిమా ఇంత‌టి హిట్ అవ్వ‌డానికి కార‌ణం రాజ్‌పుత్‌.ట్రైల‌ర్‌లోనే అందాల ఆర‌బోత‌కు తెర లేపింది ఈ భామ‌.దీంతో యూత్ థియోట‌ర్ల‌కు జ‌నాలు క్యూ క‌ట్టారు.థియోట‌ర్ల‌కు వచ్చిన జ‌నాల‌ను అందంతోనే కాక త‌న న‌ట‌న‌తో కూడా ఆక‌ట్టుకుంది.దీంతో సినిమాకు రిపీట్ ఆడియెన్స్ ఎక్కువ అయ్యారు.ఈ సినిమా హిట్‌తో వ‌ర‌స ఆఫ‌ర్ల‌తో దూసుకుపోతుంది.

ఇప్ప‌టికే మ‌హేశ్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసింద‌నే వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా మ‌రో క్రేజీ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా పాయ‌ల్ రాజ్‌పుత్ ఎంపిక అయింద‌ని తెలుస్తుంది.తాజాగా ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఆమెతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. అతడు నిర్మిస్తోన్న సినిమాలో హీరోయిన్ గా నటించమని ఆమెను సంప్రదించగా పాయల్ అంగీకరించినట్లు తెలుస్తోంది. మ‌రి ఈ సినిమాలో హీరో ఎవ‌రో,డైర‌క్ట‌ర్ ఎవ‌రో తెలియాలి అంటే మ‌రి కొద్ది రోజులు ఆగాల్సిందే.ద‌ర్శ‌కుడు,హీరో ఎవ‌రు ఎంపిక కాక‌ముందే హీరోయిన్ ముందు ఎంపిక చేయ‌డం చూస్తుంటే రాజ్‌పుత్ పాయ‌ల్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -