Tuesday, May 21, 2024
- Advertisement -

ఆక్సిజ‌న్ సినిమా వాయిదాల ప‌ర్వం… 30న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌

- Advertisement -

వాయిదాల మీద వాయిదాలు చేస్తూ అస‌లు ఆ సినిమా ఉందా లేదా అనే స్థాయికి తీసుకొచ్చారు. కొన్ని రోజులు ఈ డేట్‌కు రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించి తీరా అది అయిపోయాక వాయిదా వేశామ‌ని ప్ర‌క‌టిస్తారు. ఏమో ఏమి జ‌రుగుతుందేమో గానీ గోపీచంద్ న‌టించిన ‘ఆక్సిజన్’ సినిమా మాత్రం విడుద‌ల‌కు నోచుకోడం లేదు. ఇప్పటిదాకా ఐదుసార్లు ‘ఆక్సిజన్’ సినిమా విడుద‌ల తేదీలు మార్చారు. ఈ రోజు రేపు మాపు అంటూ ఇలా పొడిగిస్తూ పోతున్నారు. త‌ప్ప విడుద‌ల చేయ‌డం లేదు. అస‌లు వారికి విడుద‌ల చేయాల‌ని ఉందో లేదో. లేకుంటే ఆ సినిమాపై న‌మ్మ‌కం లేదో తెలియ‌డం లేదు.

గ‌త ఆగస్టు 18వ తేదీ మొదలుకుని.. నవంబర్ 17వ తేదీ వరకు మళ్లీ మళ్లీ విడుద‌ల తేదీలు మారుస్తూ వ‌చ్చారు. ప్రతిసారీ కొత్తగా రెండు పోస్టర్లు విడుద‌ల చేయడం.. కొత్త తేదీ చెప్పడం.. కొన్నాళ్ల తర్వాత చప్పుడే లేకపోవడం.. సినిమా వాయిదా అంటూ సమాచారం రావడం.. ఇదే వరుస అయిపోయింది. ఈసారి నవంబ‌ర్ 17వ తేదీన పక్కా అని చెప్పి.. ఆ తేదీకి కూడా సినిమా తీసుకురాలేదు. దీంతో ఈ సినిమాపై అభిమానులకు, ప్రేక్ష‌కుల‌కు ఆశలు పోయాయి. ఐతే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా విడుద‌ల తేదీ ప్ర‌క‌టించారు. నవంబర్ 30వ తేదీన ‘ఆక్సిజన్’ను విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా రెండు కొత్త పోస్టర్లు విడుద‌ల చేశారు. గోపీచంద్‌తో రాశీ ఖన్నా న‌టిస్తుండ‌గా అను ఇమ్మాన్యుయెల్ కీలక పాత్ర పోషిస్తోంది. జ్యోతికృష్ణ ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని అతడి తండ్రి ఎ.ఎం.రత్నం నిర్మిస్తున్నాడు. యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

https://www.youtube.com/watch?v=9ole5dIsp6Y

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -