Saturday, May 18, 2024
- Advertisement -

స్పిన్న‌ర్ల మాయాజాలం ..నాగ్ పూర్ రెండో టెస్ట్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 205 కి కుప్ప‌కూలిన లంక‌..

- Advertisement -

నాగ్‌పూర్‌లో జ‌రుగుతున్న రెండో టెస్ట్‌లో శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌కు తెర‌ప‌డింది. భార‌త స్పిన్న‌ర్లు లంక‌ను చుట్టేశారు. స్పిన్నర్ల ధాటికి 79.1 ఓవర్లలో 205 పరుగులకే చేతులెత్తేసింది. మొద‌ట లంక టాస్ గెలిచి బ్యాంటింగ్ ఎంచ‌కున్న సంగ‌తి తెల‌సిందే.

బ్యాటింగ్ ఎంచుకున్న లంక ఓపెనర్‌ కరుణరత్నే, కెప్టెన్‌ దినేశ్‌ చండీమాల్‌ తప్ప లంక ఆటగాళ్లు ఎవరూ రాణించలేకపోయారు. జట్టు స్కోరు 20 పరుగుల వద్ద పేసర్‌ ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో ఓపెనర్‌ సమరవిక్రమ(13) ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన తిరిమన్నే (9) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌ బాటపట్టాడు. మాథ్యూస్‌ ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన దినేశ్‌ చండీమాల్‌(57) ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో అర్ధశతకం కూడా నమోదు చేసుకున్నాడు. 72వ ఓవర్లో చండీమాల్‌ను అశ్విన్‌ ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనక్కి పంపాడు. కీలక సమయాల్లో జడేజా కూడా వికెట్లు పడగొట్టడంతో పర్యాటక జట్టు 205 పరుగులకే కుప్ప కూలింది.

అశ్విన్ 4 వికెట్లు, జడేజా 3 వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ ముగ్గుర్ని పెవిలియన్ చేర్చాడు. శ్రీలంక బ్యాట్స్ మెన్లలో కెప్టెన్ చండిమల్ 57 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కరుణరత్నే 51 పరుగులతో మరో హాఫ్ సెంచరీ సాధించాడు. మిగిలిన వారిలో సమరవిక్రమ 13, తిరిమన్నె 9, మాథ్యూస్ 10, డిక్ వెల్లా 24, షనక 2, పెరీరా 15, హెరాత్ 4, లక్మల్ 17 పరుగులు చేశారు. గమాగే పరుగులేమీ చేయకుండా నాటౌట్ గా నిలిచాడు.

తిరిమన్నె, చండిమల్, షనక, హెరాత్ లను అశ్విన్ ఔట్ చేయగా… మ్యాథ్యూస్, డిక్ వెల్లా, పెరీరాలను జడేజా బలిగొన్నాడు. ఓపెనర్లు సమరవిక్రమ, కరుణరత్నే లతో పాటు లక్మల్ లను ఇషాంత్ ఔట్ చేశాడు

ఇరుజట్ల మధ్య ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్టులో స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌కు ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు. రెండో టెస్టులో బ్యాట్స్‌మెన్లపై స్పిన్నర్లదే పూర్తి ఆధిపత్యం. వీరిద్దరికే ఏడు వికెట్లు దక్కాయి.

భారత్ తొలి ఇన్నింగ్స్ ను ప్రారంబించింది. కేఎల్ రాహుల్, మురళీ విజయ్ లు ఇన్నింగ్స్ ను ఆరంభించారు. తొలి బంతినే బౌండరీగా మలిచిన రాహుల్ 7 పరుగులతో ఆడుతున్నాడు. మరో ఎండ్ లో ఉన్న విజయ్ ఇంకా ఖాతాను ఆరంభించలేదు. భారత్ ప్రస్తుత స్కోరు 2 ఓవర్లకు 7 పరుగులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -