Sunday, May 5, 2024
- Advertisement -

బండ్ల గ‌ణేశ్ కు శిక్ష, జ‌రిమానా విధించిన ఎర్ర‌మంజిల్ కోర్టు

- Advertisement -

న‌టుడిగా సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మై సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా బండ్ల గ‌ణేశ్ స్థిర‌ప‌డిపోయాడు. వ‌రుస సినిమాలు చేస్తున్న అత‌డు ఒక్క‌సారిగా నిర్మాత అవతారమెత్తాడు. అంద‌రూ షాక్కావ‌ల్సిన ప‌రిస్థితి అప్పుడు. బండ్ల గ‌ణేశ్ నిర్మాత‌నా? అంత సంపాదించేశాడా? అని ప్ర‌శ్నించుకున్నారు. ఏమో అత‌డు వెనుక ఎవ‌రున్నారో? అంత సంపాద‌న ఉందో తెలియ‌దు గానీ. అత‌డైతే నిర్మాత‌గా మారి ప‌లు తీసిన సినిమాలు వెండి తెర‌పై వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను గ‌బ్బ‌ర్‌సింగ్‌గా తీసిన సినిమా థియేట‌ర్ల‌ను ఖాళీ లేకుండా చేసింది. ‘ఆంజనేయులు’ సినిమాతో నిర్మాతగా ప్రారంభ‌మైన అత‌డి జీవితం ఉన్న‌త స్థితికి చేరింది. పరమేశ్వర ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ‘గబ్బర్‌సింగ్‌’, ‘బాద్‌షా’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘టెంపర్‌’లాంటి విజయవంతమైన సినిమాలు ఆయన‌వే.

అయితే శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని ఎర్ర‌మంజిల్ కోర్టు ఆరు నెల‌ల జైలుశిక్ష విధించింద‌నే విష‌యం సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌ల‌క‌లం సృష్టించింది. ఎందుకు శిక్ష‌? ఏం ప‌ని చేశాడు? అని అంద‌రూ ప్ర‌శ్నించుకుంటున్నారు. ‘టెంపర్‌’ సినిమా క‌థ‌కు చెల్లని చెక్కు ఇచ్చారని ఆ సినిమా రచయిత వక్కంతం వంశీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీనిపై శుక్రవారం (నవంబర్-24) ఎర్రమంజిల్‌ కోర్టులో విచారణ చేశారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. గణేశ్‌కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు, రూ.15 లక్షల 86 వేల 550 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. రూ.25 లక్షలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు కోర్డు ఈ శిక్ష విధించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -