Thursday, May 9, 2024
- Advertisement -

వేశ్య పాత్ర‌లో ఆ హీరోయిన్‌

- Advertisement -

ఇటీవ‌లే అడవి శేష్ న‌టించిన గూఢ‌చారి మూవీ ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.ఆ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన శోభిత దూళిపాళ్లకు మంచి పేరు వ‌చ్చింది.దీంతో ఈ అమ్మ‌డికి వ‌ర‌స ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.లిప్ లాక్స్, బోల్డ్ క్యారెక్టర్లలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదని తన మొదటి సినిమా ద్వారా చెప్పకనే చెప్పింది ఈ మాజీ మిస్ ఇండియా. దీంతో దర్శకనిర్మాతలు కూడా ఆమెను సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.ప్ర‌స్తుతం ఆమె మలయాళంలో ‘మూతోన్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో శోభిత ఓ వేశ్య పాత్రలో కనిపించనుంద‌ని స‌మాచారం.

సెక్స్ వర్కర్ పాత్రలో నటించడం ఛాలెంజింగ్ గా ఉంటుందని అందుకే ఈ పాత్ర అంగీకరించానని చెబుతోంది ఈ బ్యూటీ. కెరీర్ ఆరంభంలోనే ఇటువంటి పాత్రలో నటించడానికి సిద్ధమై శోభిత పెద్ద సాహసం చేస్తోందనే చెప్పాలి.ఫ్యాషన్ బ్యాక్ డ్రాప్ నుండి వచ్చిన శోభిత దూళిపాళ్ల తెలుగ‌మ్మాయి కావ‌డం విశేషం.మ‌రి ఆమె వేశ్య పాత్ర‌లో ఎలా రాణిస్తుందో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -