Friday, May 17, 2024
- Advertisement -

ఈ హీరో ఎవ‌రో గుర్తు ప‌ట్టారా?

- Advertisement -

మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవ‌రో గుర్తు ప‌ట్టారా? అదేనండీ తమిళ హీరో విజయ్ సేతుపతి.రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో పాత్రలు ఎవరైనా చేస్తారు. అదేమి పెద్ద విశేషం కాదు. కానీ ఛాలెంజింగ్ అనిపించే పాత్రలను చేయటం అంటే నటనలోనే కాదు చాలా రకాల ఇబ్బందులను సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి సవాళ్లు ఛాలెంజింగ్‌గా తీసుకుని సినిమాలు చేస్తున్నాడు విజ‌య్.

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన విజ‌య్ సేతుప‌తి పిజ్జా సినిమాతో హీరోగా మారాడు.ఈ సినిమా త‌రువాత అన్ని స‌క్సెస్‌లే అందుకున్నాడు విజ‌య్ సేతుప‌తి. తాజాగా సీతకాతి అనే తమిళ సినిమా కోసం వయో వృద్ధుడిగా తన కెరీర్లో ఇంతకుముందెన్నడూ చేయని పాత్ర చేస్తున్న విజయ్ సేతుపతి దాని మేకప్ కోసం ఎంత కష్టపడుతోంది వీడియో రూపంలో విడుదల చేసింది యూనిట్. తెలుగులో సైరా నరసింహరెడ్డితో చిరంజీవితో కలిసి నటించబోతున్న విజయ్ సేతుపతి త్వరలోనే సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -