Thursday, May 2, 2024
- Advertisement -

పొడిచేస్తా చించేస్తా అని నిద్దరోయిన జనసేనాని

- Advertisement -

ట్విటర్ కళ్యాణ్ ఎక్కడ ? ఏ గెస్ట్ హౌస్ లో నిద్రోతున్నాడు ? ఏ సినిమా షూటింగ్ లో డ్యూయెట్లు పాడుతున్నాడు ? ట్విటర్ కళ్యాణా ? అని అనుమానంగా ప్రశ్నించకండి. అతడే పవన్ కళ్యాణ్. ప్రత్యేకహోదా కోసం వైఎస్ఆర్ సీపీ ఎంపీలు రాజీనామాలు చేసేయండి. టీడీపీ మంత్రులు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలగండి. మీ రెండు పార్టీలు ప్రధాని మోడీ మెడలు వంచండి. మీ పోరాటానికి నా మద్దతు ఇస్తాను. దేశవ్యాప్తంగా తిరిగేసి, అన్ని పార్టీల మద్దతు కూడగడతాను. ప్రత్యేకహోదా కోసం మీరు అవిశ్వాస తీర్మానం పెడితే, నేను దేశవ్యాప్త పర్యటనతో అన్ని పార్టీల మద్దతు కూడగట్టి మన సత్తా చాటేస్తాను. కేంద్ర ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి మన హక్కులు సాధిస్తాను. అంటూ ఇటీవల బహిరంగ సభల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఊగిపోతూ ఉపన్యాసమిచ్చేశారు. నాకు చిత్తశుద్ధి ఉంది, నాకు పోరాడాలనే పౌరుషం ఉంది. నాకు జీవితంపై ఆశ లేదు. నాకు రాజకీయాల మీద మోజు లేదు. పదవులు పట్టుకుని వేలాడాలని నాకు లేదు. నీచమైన, తుచ్ఛమైన పదవుల కోసం నేను అమ్ముడుపోను. నేను నిజాయతీపరుడుని, నేను ఆవేశపరుడుని, ఆంధ్రా హక్కుల కోసం ప్రత్యేకహోదా కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తా…అని సినిమా డైలాగులను మించిపోయిన డైలాగులను పవన్ సార్ చెప్పేశారు.

సీన్ కట్ చేస్తే పవన్ చెప్పినట్టే, ఆయన కోరినట్టే టీడీపీ, వైఎస్ఆర్ సీపీ చేశాయి. కేంద్రమంత్రి పదవులకు రాజీనామాలతో పాటు, ఎన్డీఏ కూటమికి టీడీపీ గుడ్ బై చెప్పేసింది. అవిశ్వాస తీర్మానం పెట్టి, ప్రత్యేకహోదాపై చర్చకు మోడీ దిగివచ్చేలా చేసింది. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు కూడా పదవులకు రాజీనామాలు చేసేశారు. పార్లమెంట్ లో తమ గొంతు వినిపించే అవకాశం లేకపోవడంతో, పార్లమెంట్ వెలుపలే నినాదాలు వినిపిస్తున్నారు. జాతీయ మీడియా ఎదుట తామెందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో.. వివరిస్తూ హోదా ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. ప్రత్యేకహోదా ఇస్తేనే ఆంధ్రాకు భవిష్యత్ ఉందని, వారి శక్తిమేరా వైఎస్ఆర్ సీపీ మాజీ ఎంపీలు జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

కానీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాత్రం మళ్లీ అడ్రస్ లేకుండా పోయారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడూ ఈయనగారి అడ్రస్ గల్లంతయింది. దేశమంతా తిరిగేస్తా, మద్దతు కూడగట్టేస్తా, పొడిచేస్తా, చించేస్తా… నాకు చిత్తశుద్ధి ఉంది, అన్యాయంపై ఎదిరించే ధైర్యం ఉంది. పోరాడే సత్తా ఉంది. టీడీపీ, వైఎస్ఆర్ సీపీలకు అవి లేవు. అని వేదికలెక్కి ఊగిపోయిన పవన్ అడ్రస్ మళ్లీ గల్లంతయింది. గత కొద్ది రోజులుగా ప్రత్యేకహోదా, అవిశ్వాస తీర్మానంపై దేశమంతా మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం చడీ చప్పుడు లేకుండా పోయాడు. శుక్రవారం పార్లమెంట్ లో అవిశ్వాసం, ప్రత్యేకహోదాపై చర్చ జరుగుతుంటే… ఈ పెద్దమనిషి చాలా కూల్ గా ట్వీట్ చేశాడు. టీడీపీపై కోపంతో ఆంధ్రాకు అన్యాయం చేయవద్దు. ప్రత్యేకహోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను…అని చాలా పొదుపుగా, కూల్ కూల్ గా పవన్ రెండు ముక్కలు ట్వీటాడు. ఇదీ పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధి. ధైర్యం, తెగింపు, పోరాడే స్ఫూర్తి…ఇంతేకాదు ఇలాంటివి ఇంకా ఎన్నైనా ఆయన అభిమానులు చేర్చుకోవచ్చు. కీలక సమయాల్లో అడ్రస్ లేకుండా ఈ పారిపోవడాలు ఏంటో ? ప్రియురాలికి ప్రేమలేఖ రాసినట్టు, చాలా సున్నితంగా, తేలికైన పదాలతో, మోడీ సున్నిత మనసుకు గాయం కాకుండా, కేంద్రప్రభుత్వంలోని మంత్రుల మనోభావాలు దెబ్బతినకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి రెండు ముక్కుల ట్వీట్ చేయడాలు ఏంటో ..? పవన్ కూ, ఆయన అభిమానులకే అర్ధం కావాలి.

ఈ మాత్రం దానికి నేనో తోపు. నేనో ధీశాలి. నేనెవ్వరికీ భయపడను, నేను అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చాను. నాకు చావంటే భయం లేదు, నాకు మోడీ అంటే భయం లేదు. నాకు ప్రాణాల మీద ఆశలేదు…నేను విప్లవ పుస్తకాలు చదివేశాను. చేగువేరాను జీర్ణం చేసుకున్నాను. ఆయన రగిల్చిన స్ఫూర్తి నిలువెల్లా నాలో ప్రవహిస్తోంది. నా రక్తం మరుగుతోంది…ఇలా డైలాగులు చెప్పి, మాయమైపోతున్నాడు పవన్ కళ్యాణ్. మాటలే తప్ప చేతల్లో కానరాని ఈ డబ్బారాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. సారీ కాటమరాయుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన ఒక నాయకుడు. జనసేన ఒక పార్టీ. థూ…

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -