Friday, May 17, 2024
- Advertisement -

జాన్వీ కపూర్ ‘ధడక్’ మూవీ రివ్యూ

- Advertisement -

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ధడక్ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి కూతురు కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా, మరాఠీలో హిట్టైన సైరాత్‌ సినిమాకు ఇది రీమేక్. మరాఠాలో భారీ విజయం సాధించిన ఈ సినిమా బాలీవుడ్ లో ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.

కథ : అశుతోష్ రానా రాజస్థాన్ లో పేరుమోసిన రాజకీయ నాయకుడు. బడా వ్యాపారి. తక్కువ కులానికి చెందిన వ్యక్తులకు మర్యాద ఇవ్వకూడదని, వారితో కనీసం మాట్లాడకూడదని షరతులు పెడతాడు. రానా కూతురు జాన్వీ మాత్రం తండ్రి మాటలను పట్టించుకోదు. కులాలకు, మతాలకు వ్యతిరేకం. మనుషులంతా ఒక్కటే అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతుంది. ఇదే సమయంలో ఇషాన్ కు జాన్వీతో పరిచయం ఏర్పడుతుంది. ఇషాన్ పిరికివాడు ,దీంతో ఇషాన్ ను ఎప్పుడు ఏడిపిస్తుంటుంది. అలా ఆ ఇద్దరిమధ్య ప్రేమ పుడుతుంది. వీరిద్దరి ప్రేమ విషయం రానా కు తెలియడంతో.. పెద్ద గొడవ జరుగుతుంది. ఇద్దరినీ ఎలాగైనా విడదీయాలని అనుకుంటాడు. మరి ఈ ఇద్దరినీ విడదీశారా లేదా..? వీరి ప్రేమను ఎలా గెలిపించుకున్నారు అన్నది మిగతా కథ.

విశ్లేషణ : కులాంతర ప్రేమలు, గొడవలు వంటి నేపథ్యంతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ధడక్ ప్రేమకథ చాలా సున్నితమైనది. అబ్బాయి పిరికివాడిగా చూపించే కథలో కొంచెం కొత్తదనం ఉండే విధంగా చూశారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ‘హంప్టీ శర్మా కీ దుల్హనియా’, ‘బద్రీనాథ్‌ కీ దుల్హనియా’ సినిమాలు గుర్తుకు వస్తాయి. సున్నితమైన ప్రేమకథకు రాజకీయ అంశాలను జోడించి కథను నడిపించిన తీరు బాటుంది. సినిమా మొత్తం ప్రతి ప్రేము అందంగా, కలర్ఫుల్ గా ఉంటుంది.

నటీనటుల పనితీరు : ఈ సినిమాకు జాన్వీ, ఇషాన్ ల నటన ప్రత్యేకం అని చెప్పాలి. ఇషాన్ కు ఇది రెండో సినిమా. చాలా కాన్ఫిడెన్స్ గా నటించాడు. జాన్వీ కపూర్ కు ఇది మొదటి సినిమానే అయినప్పటికీ నటన పరంగా మెప్పించింది. అందంతో ఆకట్టుకుంది. కళ్ళతో పలికించే హావభావాలు ఆకట్టుకుంటాయి. కొన్ని సన్నివేశాల్లో జాన్వీ నటన శ్రీదేవిని గుర్తుకుతెస్తుంది. అశుతోష్ రానా విలన్ పాత్రలో మెప్పించాడు. మిగతా నటీనటులు ఎవరి పాత్రలకు వారు న్యాయం చేశారు.

సాంకేతికం : శశాంక్ ఖైతాన్ దర్శకత్వం ఈ సినిమాకు ప్లస్ అయింది. రీమేక్ సినిమా అయినప్పటికీ.. కథనాలను నడిపిన తీరు ఆకట్టుకుంది. ఇషాన్, జాన్వీ లనుంచి నటనను రాబట్టుకోవడంతో శశాంక్ సఫలం అయ్యాడు. ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ సంగీతం. పాటలు మళ్లీమళ్లీ వినాలనిపించే విధంగా ఉన్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

బోట‌మ్ లైన్ : ఒరిజిన‌ల్ మూవీ (సైర‌త్) చూసిన వాళ్ల‌కు ధడక్  ఎక్క‌దేమో.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -