Friday, May 3, 2024
- Advertisement -

ట్రెండింగ్‌లో మహేష్ దమ్ మసాలా!

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఖలేజా, అతడు తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. 13 ఏళ్ల తర్వాత వస్తున్న ఈ హ్యాట్రిక్ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాత ఎస్.రాధాకృష్ణ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇక త్రివిక్రమ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన దమ్ మసాలా సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సరస్వతీ పుత్ర రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని సంజిత్ హెగ్డే, జ్యోతి నూరన్ ఆలపించారు. పాటలోని సాహిత్యం కథానాయకుడి పాత్ర తీరుని తెలపగా తమన్ అందించిన సంగీతం బాగుంది.

మహేష్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి, జగపతి బాబు, జయరామ్, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ కీలకపాత్ర పోషిస్తున్నారు. 2024, సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. మొత్తంగా ఫస్ట్ సాంగ్ దమ్ మసాలాతో దీపావళికి మరింత ఘాటు తీసుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -