Thursday, May 2, 2024
- Advertisement -

మ్యాక్స్‌వెల్ సునామీ…మెగాటోర్నికే హైలెట్

- Advertisement -

ఆప్ఘానిస్తాన్ – ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఆసక్తికర పోరులో ఆసీస్ పైచేయి సాధించింది. మ్యాక్స్ వెల్ విధ్వంసం ముందు ఆప్ఘానిస్తాన్ చిన్నబోయింది. ఆసీస్ ఓటమి ఖాయం అనుకున్నారు అంతా కానీ వన్ మ్యాన్ ఆర్మీగా రెచ్చిపోయారు మ్యాక్స్ వెల్. తన కెరీర్‌లోనే చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ని ఆడి ప్రపంచకప్‌లో తిరుగులేని విజయాన్ని అందించాడు. అజేయ డబుల్‌ సెంచరీతో అఫ్గాన్‌పై వీరవిహారం చేసి ఆసీస్‌ని సెమీస్‌కు తీసుకెళ్లాడు. దీంతో కీలక మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆసీస్.

అఫ్గాన్‌ నిర్దేశించిన 292 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసింది. ఓ దశలో 91 పరుగులకే 7 వికెట్లు కొల్పోయింది ఆసీస్. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కమిన్స్‌…మ్యాక్స్‌వెల్‌కే ఎక్కువగా స్ట్రైక్ ఇచ్చి మ్యాచ్‌ను స్వరూపాన్ని మార్చేవాడు. ఇక మ్యాక్స్‌వెల్‌ సునామీ ముందు ఆప్ఘాన్ బౌలర్లు తేలిపోయారు. 128 బంతుల్లో 21ఫోర్లు, 10 సిక్స్‌లతో 201 నాటౌట్‌,గా నిలిచి ఒంటిచేత్తో ఆసీస్‌ను గెలిపించాడు.

ఇక అంతకముందు బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కొల్పోయి 291 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఇబ్రహీం జద్రాన్‌ 143 బంతుల్లో 129 నాటౌట్ రాణించారు. ఇక ప్రపంచకప్‌లో ఆప్ఘాన్ తరపున సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. చివర్లో రషీద్‌ఖాన్‌ 18 బంతుల్లో 35 చేయడంగా ఆప్ఘాన్ భారీ స్కోరు సాధించింది. డబుల్‌ సెంచరీతో జట్టును గెలిపించిన మ్యాక్స్‌వెల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -