Thursday, May 2, 2024
- Advertisement -

బాబీ – బాలయ్య…క్రేజీ అప్‌డేట్!

- Advertisement -

వరుస హిట్ సినిమాలతో జోష్ మీదున్నారు నందమూరి బాలకృష్ణ. అఖండ,వీర సింహారెడ్డి,భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్ కొట్టారు బాలయ్య. ప్రస్తుతం పాలిటిక్స్‌తో పాటు అన్ స్టాపబుల్‌ షోతో బాలయ్య బిజీగా ఉన్నారు. ఇక తన తర్వాతి ప్రాజెక్టు బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే.

రీసెంట్‌గా చిరుతో వాల్తేరు వీరయ్యను తెరకెక్కించి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు బాబీ. ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమా కోసం కథను సిద్ధం చేయగా అది కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు వరకు సినిమా ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా బాబీ కథను సిద్ధం చేయగా సరికొత్తగా కనిపించనున్నారట. నాగవంశీ సినిమాను నిర్మిస్తుండగా త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

చిరంజీవి, రవితేజ,వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసి హిట్ కొట్టారు బాబీ. పవన్‌తో సర్దార్ గబ్బర్ సింగ్ తెరకెక్కించినా అది బాక్సాఫీస్ ముందు అంతగా ఆడలేదు. వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టగా బాలయ్యతో తెరకెక్కించే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -