Saturday, April 27, 2024
- Advertisement -

గుంటూరు కారంలో మీనాక్షి అదుర్స్

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది చిత్రయూనిట్.

ఇక తాజాగా సినిమాలో మీనాక్షి చౌదరి క్యారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. లంగావోణీలో మహేష్ బాబు భుజాలపై చేతులు వేసి నిల్చున్న మీనాక్షి లుక్ అదిరిపోయింది. ఇక సినిమాలో వీరిద్దరి మధ్య రొమాన్స్‌ హైలైట్‌గా ఉంటుందట. రాజీ పాత్రలో మీనాక్షి పిక్చర్ పర్‌ఫెక్ట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

మహేష్ సరసన మరో హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుండగా ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం కీలక పాత్రలు చేస్తున్నారు. హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -