Saturday, April 27, 2024
- Advertisement -

ప్రమోషన్స్‌లో బిజీగా గుంటూరు కారం టీమ్!

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇక ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయగా తాజాగా ఓ పోస్టర్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

ఈ సారి రాబోయే సాంగ్ కు వూఫర్స్ బద్దలైపోవాల్సిందేనని, అందుకు సూపర్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండాలని సూచించారు మేకర్స్. హై వోల్టేజీ తో కూడిన స్పైపీ, మాస్, హాట్ కలగలిపిన సాంగ్ ను రాబోతుందని హామీనిచ్చారు. దీంతో పాటు క్రేజీ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

దాదాపు 13 ఏళ్ళ తర్వాత త్రివిక్రమ్ – మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా మంచి టాక్ సొంతం చేసుకోగా హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మిస్తున్నారు. మహేష్ సరసన శ్రీలీలా హీరోయిన్‌గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -