Monday, April 29, 2024
- Advertisement -

పుష్ప 2..సంజయ్ వర్సెస్ బన్నీ!

- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప. ఫస్ట్ పార్ట్ సూపర్ డూపర్ హిట్ కావడంతో సినిమా సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుండగా అదిరే అప్‌డేట్, లీక్‌లతో పుష్ప 2 సినిమా వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో రూమర్ టీ టౌన్‌లో చక్కర్లు కొడుతోంది. సంజయ్ దత్ – బన్నీ ల పై క్రేజీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉంటాయని టాక్. దీనిని సుకుమార్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్లాన్ చేస్తున్నారట. అందుకే ప్రతీ ఫ్రేమ్‌ను జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా జాతర బ్యాక్‌డ్రాప్‌లో ఉండే సీన్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందట.

ఇక పుష్ప సినిమాలో అల్లు అర్జున్‌ నటనకి జాతీయ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి డిఎస్పీ సంగీతం అందిస్తుండగా ఫ‌హ‌ద్ ఫాసిల్ విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -