Friday, May 3, 2024
- Advertisement -

ట్రెండింగ్‌లో మహేష్ మూవీ సాంగ్

- Advertisement -

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ధమ్ మసాలా అంటూ రిలీజ్ చేసిన సాంగ్‌ తెలుగు ఆల్బమ్‌లలో టాప్ సాంగ్‌గా నిలిచింది.

ఇక తాజాగా రెండో సాంగ్ ఓ మై బేబీని రిలీజ్ చేయగా అది కూడా ట్రెండింగ్‌లో నిలిచింది. తమన్ సంగీతం అందించిన ఈ సాంగ్ శీతాకాలపు ఉదయం ఆనందకరమైన మెలోడీని వింటూ పొగలు కక్కే కాఫీ తాగుతున్న అనుభూతిని కలిగి్తోంది. శిల్పా రావు పాడిన ఈ సోల్ ఫుల్ మెలోడీకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సంగీతం, సాహిత్యం, గాత్రం అన్నీ అద్భుతంగా కుదిరిన ఈ పాట అందరిని కట్టిపడేస్తోంది.

సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. మహేష్ బాబు సరసన అందాల తార శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా మీనాక్షి చౌదరి,రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -