Sunday, May 5, 2024
- Advertisement -

తగ్గేదెలే అంటున్న జగన్!

- Advertisement -

గత ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించి 151 స్థానాల్లో విజయం సాధించింది వైసీపీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వార్ వన్‌ సైడ్‌గా జరిగింది 2019లోనే. చంద్రబాబు సైతం ఇంతటి దారుణ పరాభవాన్ని ఊహించలేదు. అయితే తర్వాత జరిగిన పరిణామాలన్ని టీడీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్, తెలంగాణలో టీడీపీ క్లోజ్ ఇలా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి.

ఇక ఈ ఐదేళ్లలో సంక్షేమం, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ జగన్ పాలన సాగింది. దీంతో ఈసారి వైనాట్ 175 లక్ష్యంతో జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఒకటి సిట్టింగ్‌ల మార్పు. ఇప్పటికే 11 స్థానాలకు కొత్త ఇంఛార్జీలను నియమించగా త్వరలోనే మరిన్ని స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చేందుకే సిద్ధమయ్యారు జగన్.

సిట్టింగ్‌ల నుండి వ్యతిరేకత వచ్చినా తగ్గేదెలే అంటున్నారు జగన్. రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రజా వ్యతిరేకత ఉన్నవారిని నిరభ్యంతరంగా పక్కన పెట్టేందుకు జగన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీలో నెలకొంటున్న పరిస్థితులు చూస్తుంటే ఇంకా 50కి పైగా స్థానాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోండగా ఏదిఏమైనా జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు మాత్రం వైసీపీ శ్రేణుల్లో రెండోసారి గెలుపు పక్కా అనే ధీమా వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -