Friday, May 3, 2024
- Advertisement -

క్లైమాక్స్‌ షూట్‌లో గుంటూరు కారం!

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఇక ఈ మూవీ అప్‌డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూట్ జరుగుతోంది.ఇందుకోసం రూ.5 కోట్ల రూపాయల భారీ సెట్‌లో క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.మహేష్ కోసం పీటర్ హెయిన్ విభిన్నమైన యాక్షన్ బ్లాక్‌ని డిజైన్ చేశారని…ఇది సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. మహేష్ అభిమానులకు ఈ యాక్షన్ సీక్వెన్స్ కనుల విందుగా కానుందని చిత్ర వర్గాల సమాచారం.

డిసెంబర్ మొదటివారంలో షూటింగ్ పూర్తి చేసి అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేయనున్నారట. మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుందని తెలుస్తోండగా హారిక & హాసిని క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇప్పుడు వస్తున్న హ్యాట్రిక్ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -