- Advertisement -

దసరాకు ఓకే..మరి దీపావళి సంగతేంటి బాబు!

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 28 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు కాగా జైలు నుండి బయటికి రావడానికి బాబు తరపు లాయర్లతో పాటు టీడీపీ నాయకులు చేయని ప్రయత్నాలు లేవు. ప్రధానంగా చంద్రబాబు ఆరోగ్య సమస్య, వయస్సును ప్రస్తావిస్తూ సింపతి రాజేసే ప్రయత్నం చేశారు.

చివరకు ఆరోగ్య సమస్య నేపథ్యంలో బాబుకు మధ్యంతర బెయిల్ దక్కింది. అయితే ఈ క్రమంలో దసరా జైల్లోనే జరుపుకున్నారు చంద్రబాబు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారంటూ ఓ ఫేక్ లెటర్‌ని సర్క్యూలేట్ చేశారు. అయితే అది fake అని జైలు అధికారులు తేల్చిన టీడీపీ మేధావులు మాత్రం అసత్య ప్రచారాన్ని ఆపలేదు.

అయితే దసరాకి ఫేక్ లెటర్‌తో నానా హంగామా చేసిన టీడీపీ నేతలు, ప్రధానంగా చంద్రబాబు…ఉత్తరం ఎందుకు రాయలేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సరే ఉత్తరం సంగతి పక్కన పెడితే కనీసం శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదని టీడీపీ నేతలే మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా దీపావళి వేళ చంద్రబాబుకు ప్రజల పట్ల ఉన్న శ్రద్ధం ఏంటో బయటపడిందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇకనైనా తెర వెనుక బాగోతం మానేసి చంద్రబాబు బయటకి వస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -