Friday, May 17, 2024
- Advertisement -

‘దేవర’ పార్ట్ 2..అప్‌డేట్!

- Advertisement -

ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్టు దేవర. ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ప్రతి అంశంలో కేర్ తీసుకుని ముందుకు వెళ్తున్నారు. రెండు పార్టులుగా ఈ సినిమా రిలీజ్ కానుండగా ఫస్ట్ పార్ట్‌ను దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.

ఇక ఫస్ట్ పార్టుకు సంబంధించి ఇప్పటికే రిలీజైన ఎన్టీఆర్ పోస్టర్‌కి మంచి స్పందన రాగా సెకండ్ పార్టులో ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ అండ్ మోడ్రన్ లుక్ లో కనిపించనున్నారట. అంటే తారక్ హెయిర్ స్టైల్ పూర్తిగా మారిపోనుందట.

ఆచార్య మిగిల్చిన చేదు అనుభవాన్ని దేవరతో చెరిపేయాలని భావిస్తున్నారు తారక్. అందుకే కథ కోసం చాలా కసరత్తు చేశారట. వాస్తవానికి తొలుత సినిమాను ఒకే పార్టుగా తీయాలని భావించారు కొరటాల. అయితే కథలో ఏ ఒక్కరి పార్టును తీసేసే ఛాన్స్ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -