Saturday, May 18, 2024
- Advertisement -

‘సేనాపతి’ అనే టైటిల్ ఖరారు?

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ ఊహించని షాక్ పవన్ కళ్యాణ్ తగిలింది. ఆ సినిమా ఫ్లాప్ ప్రభావంతో తన తదుపరి సినిమాని ఇటీవలే ప్రారంభించాడు పవన్. ఎస్.జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి రెండు వార్తలు పరిశ్రమలో సందడి చేస్తున్నాయి అదేమిటంటే….

ఈ సినిమా స్టొరీ లైన్ గురించి దర్శకుడు ఓ హిట్ ఇచ్చాడు. ఫ్యాక్షనిస్ట్ ప్రేమలో పడతాడు. ఈ స్టొరీ లైన్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఇది తమిళ హిట్ మూవీ వీరమ్ కి రీమేక్ అని అంటున్నారు. ఆ స్టొరీ లైన్ తీసుకొని తెలుగు నేటివిటి, పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా మార్పులు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

మరో వార్త ఏంటంటే….ఈ సినిమాకి హుషారు అనే టైటిల్ ఖరారు చేశారని మొన్నటివరకు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు టైటిల్ అది కాదని, ‘సేనాపతి’ అనే టైటిల్ ఖరారు చేశారని తెలుస్తుంది. ఈ టైటిల్ కి నమ్మితే ప్రాణాలైనా ఇస్తాడు అనే ట్యాగ్ లైన్ పెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -