Friday, May 10, 2024
- Advertisement -

హీరోల డ్యాన్స్‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

- Advertisement -

ఓ మీడియా ఇంట‌ర్వ్యూ శివ‌శంక‌ర్ మాస్ట‌ర్‌

దక్షిణాదిన సూప‌ర్ డ్యాన్స్ మాస్టర్‌గా కీర్తి గ‌డించిన శివశంకర్ మాస్ట‌ర్ టాలీవుడ్ హీరోల డ్యాన్స్ స్టైల్‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అల‌నాటి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో సినిమాల‌కు అద్భుత‌మైన కొరియోగ్రఫీ అందించారు. ఆయ‌న కొరియోగ్ర‌ఫీ అందించిన సినిమాల‌న్నీ సూప‌ర్‌హిట్ట‌య్యాయి. ఇప్పుడు మ‌ళ్లీ సినిమాలు అంత‌గా చేయ‌డం లేదు. అయితే ఇటీవ‌ల ఓ మీడియా ఇంట‌ర్వ్యూ లో ఆయ‌న తెలుగు హీరోల డ్యాన్సింగ్‌పై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆ త‌రం నుంచి ఈత‌రం వ‌ర‌కు ఉన్న హీరోల డ్యాన్సింగ్ స్టైల్‌పై మాట్లాడారు.

న‌ట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మంచి డ్యాన్సర్ అని శివశంకర్ తెలిపారు. ఒక‌ప్ప‌టి హీరో, ఇప్పుడు క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ చంద్రమోహన్ కూడా బాగా డ్యాన్స్ చేసేవాడు అని చెప్పారు. సూప‌ర్ స్టార్ కృష్ణ దగ్గర మంచి డ్యాన్స్ టెక్నిక్ ఉందని, శోభన్‌బాబుకు డ్యాన్స్ కంపోజ్ చేయడం మాత్రం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు.

చిరంజీవితో తాను చేసిన ‘రగులుతోంది మొగలి పొద’ పాట చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందని.. తన దగ్గర ప్రతి డ్యాన్స్ మూమెంట్‌కూ పది రకాల స్టెప్పులు ఉంటే వాట‌న్నింటినీ కాద‌ని చిరంజీవి మాత్రం ఇంకోటి ప్రయత్నిద్దామని అనేవాడు అని కొనియాడారు. తాను ప‌నిచేసిన హీరోలంద‌రీతో అనుభ‌వాన్ని పంచుకున్నారు.

ఇక ఇప్పుడు కుర్ర న‌టుల్లో మంచి డ్యాన్స‌ర్ ఎవ‌రో చెప్పేశాడు. ఈ తరంలో అల్లు అర్జున్‌ నంబర్ వన్ డ్యాన్సర్ అని శివశంకర్ బన్నీ బాగా డ్యాన్స్ నేర్చుకుని.. మన యువతరం దీన్ని ఈదాలి అని కృషి చేస్తున్నాడని.. అందుకు హ్యాట్సాఫ్ అని.. అతను బ్యూటిఫుల్ డ్యాన్సరని.. తెలుగులో టాప్ డ్యాన్సర్ బన్నీనే అని చెప్పారు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -