Monday, April 29, 2024
- Advertisement -

ప్రభుదేవా గుండెల్లో హన్సిక

- Advertisement -

హ‌న్సిక‌ను ప్రభుదేవా లైన్లో పెట్ట‌డం ఏంటి అనుకుంటున్నారా! అవునండి వీరిద్ద‌రు ప్రేమ‌లో ఉన్నారాని ఆ మ‌ధ్య సాషల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి.ఆ వార్త‌ల‌ను అటు ప్రభుదేవా ఇటు హ‌న్సిక కుడా ఖ‌డించారు అది వేరే విష‌యం అనుకోండి.మ‌ళ్లీ ఈ జోడి వార్త‌ల్లో నిలిచారు.

ప్రభుదేవా – హన్సిక నటిస్తోన్న ‘గులేబగవాళి’ అనే తమిళ సినిమాకి సంబంధించిన వ్యవహారం. ఓ పాటకి సంబంధించిన స్టిల్‌ ఇది. అంతే, అంతకు మించి ఈ ఫొటోలో ‘ఎఫైర్‌’ తాలుకు ఆనవాళ్ళేమీ వెతక్కండి.! హన్సిక, తన సోషల్‌ మీడియాలో ఈ ఫొటోని ఇలా పోస్ట్‌ చేసిందో లేదో, అలా సోషల్‌ మీడియాలో రకరకాల కథనాలు షురూ అయ్యాయి.

స్టార్‌ కొరియోగ్రాఫర్‌ అయిన ప్రభుదేవా, నటనలోనూ, దర్శకత్వంలోనూ.. ఆ మాటకొస్తే సినీ నిర్మాణంలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. అంతే కాదండోయ్‌, నయనతారతో ప్రేమ వ్యవహారంలోనూ మనోడు అప్పట్లో టాక్‌ ఆఫ్‌ది ఇండస్ట్రీ అయ్యాడు. అఫ్‌కోర్స్‌, ఆ ఎఫైర్ తర్వాత్తర్వాత బెడిసికొట్టిందనుకోండి.. అది వేరే విషయం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -