Sunday, May 19, 2024
- Advertisement -

తెలంగాణా బాట‌లో ఏపీ … కొత్త జిల్లాల ఏర్పాటు దిశ‌గా ఏపీ ప్ర‌భుత్వం….

- Advertisement -

తెలంగాణా బాట‌లోనే ఏపీకూడా న‌డుస్తోంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. విబ‌జ‌న త‌ర్వాత కొత్త జిల్లాల‌ను ఏర్పాటు చేసింది టీ ప్ర‌భుత్వం . ఇప్పుడు ఏపీ కూడా కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తోంద‌నే వార్త సోషియ‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుందో. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల సంఖ్యను 28కు పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. సంక్రాంతి నాటికి జిల్లాల విభజనకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయొచ్చని తెలుస్తోంది.

ఇప్ప‌టికే రాష్ట్రంలో అనేక స‌మ‌స్య‌లు చాల‌వ‌న్న‌ట్లు ఇప్పుడు కొత్త‌జిల్లాల ప్ర‌చార గోల మొద‌ల‌య్యింది. బాబు ఆదేశాల‌తో కొత్త‌జిల్లాల ఏర్పాటుపై క‌స‌ర‌త్తు మొద‌ల‌యిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో ఎంత నిజ‌ముందో తెలీయ‌దుగాని ..సోషల్ మీడియాలో మాత్రం విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.సంక్రాంతి క‌ల్లా 27 జిల్లాలు చేసే ప్రతిపాదన ఉన్నట్లుగా పేర్కొంటున్నారు.

సంక్రాంతికి చంద్రబాబునాయుడు కొత్త జిల్లాల ప్రకటన చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. ప్రచారంలో ఉన్న జిల్లాల జాబితా కూడా చక్కర్లు కొడుతోంది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులతో ప్రస్తావిస్తే, మంత్రులు, ఉన్నతాధాకారుల మధ్య సంభాషణల్లో కొత్త జిల్లాల అంశంపై చర్చ జరుగుతున్నట్లు చెప్పారు.

కొత్త జిల్లాలు..

శ్రీకాకుళం…. శ్రీకాకుళం, పాల‌కొండ‌
విజయనగరం… విజయనగరం, పార్వతీపురం
తూర్పుగోదావరి… కాకినాడ, అమలాపురం
పశ్చిమ గోదావరి… పశ్చిమ గోదావరి, ఏలూరు
గుంటూరు,… గుంటూరు, పొన్నూరు, నర్స‌రావుపేట‌
ప్రకాశం… ప్రకాశం, కందుకూర్
కృష్ణా… కృష్ణా, మచిలీపట్నం, గుడివాడ‌
కర్నూలు… కర్నూలు, నంద్యాల‌
విశాఖపట్నం… విశాఖపట్నం, అరకు
అనంత‌పురం… అనంత‌పురం, హిందుపురం
కడప… కడప, పులివేందుల‌
చిత్తూరు… చిత్తూరు, తిరుపతి
నెల్లూరు…

కొత్త జిల్లాలు పార్లమెంటు స్థానాల ప్రాతిపదికన జిల్లాలుగా మారుస్తారా లేక జనాభా ప్రాతిపదికన జిల్లాల కూర్పు జరగనుందా అనేది తెలియలేదు. ఇప్ప‌టికే జ‌గ‌న్ ప్ర‌తీ పార్ల‌మెంట్‌ను జిల్లాగా మారుస్తామ‌ని తెలిపారు. జ‌గ‌న్ బాట‌లోనే బాబు న‌డుస్తున్నార‌ని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -