Tuesday, May 7, 2024
- Advertisement -

రామమందిరం..హనుమాన్ విరాళం ఎంతో తెలుసా?

- Advertisement -

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జా హీరోగా తెరకెక్కిన చిత్రం హనుమాన్. సంక్రాంతి రేసులో హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమాకు అమ్ముడైన ప్రతి టికెట్ నుండి 5 రూపాయల చొప్పు రామమందిరానికి విరాళం ఇస్తామని ప్రకటించారు.

చెప్పినట్లుగా ప్రతి టికెట్‌పై రూ.5ని రామమందిరానికి విరాళంగా ప్రకటించారు. ఇప్పటికే హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూళ్లు రాబట్టగా ఇప్పటివరకు 53,28,211 టికెట్స్ అమ్ముడవ్వగా ప్రతి టికెట్ కి 5 రూపాయల చొప్పున 2,66,41,055 రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి మేకర్స్‌ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇకపై అమ్ముడయ్యే టికెట్స్ మీద కూడా 5 రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు..

హనుమాన్ సినిమా రిలీజ్ కి ముందు రోజు వేసిన ప్రీమియర్స్ లో దాదాపు 2 లక్షల 85 వేల టికెట్స్ వరకు అమ్ముడవ్వగా రూ.14.25 లక్షలను అయోధ్య రామమందిరానికి చెక్ రూపంలో అందచేసిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -