Saturday, May 4, 2024
- Advertisement -

ఎంపీగా కవిత పోటీ చేసేనా!

- Advertisement -

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి మొదలైంది. అధికార కాంగ్రెస్ ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను ప్రకటించగా బీజేపీ, బీఆర్ఎస్ సైతం సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక నిజామాబాద్ ఎంపీ పరిధిలో బీఆర్ఎస్ నుండి ఎవరు పోటీ చేస్తారా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే నిజామాబాద్ నుండి కవిత పోటీ చేస్తారని అంతా భావించగా అసెంబ్లీ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. దీంతో ఎంపీగా పోటీ చేసే విషయంలో పునరాలోచనలో పడ్డారట కవిత.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు కవిత. ఇక రీసెంట్‌గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్, బోధన్, ఆర్మూర్, జగిత్యాల, కోరుట్ల గెలుపు బాధ్యతలు భుజాన వేసుకోగా ఊహించని విధంగా మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు.

దీనికి తోడు ఎమ్మెల్సీ పదవి కాలం మరో నాలుగేళ్లు ఉండటంతో ఎంపీగా కంటే ఎమ్మెల్సీగా కొనసాగేందుకే మొగ్గుచూపుతున్నారట కవిత. ఎమ్మెల్సీగా కొనసాగితే మండలిలో పార్టీ గొంతు బలంగా వినిపించే అవకాశం ఉందని భావిస్తోందట. అయితే కొంతమంది కవితనే ఎంపీగా పోటీ చేయించాలని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారట. ఒకవేళ కవిత కాదంటే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పేరును పార్టీ పరిశీలిస్తోందని టాక్. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత మరోసారి పోటీ చేస్తారా లేదా అన్నదానిపై కార్యకర్తల్లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -