Sunday, April 28, 2024
- Advertisement -

సాధారణ వ్యక్తికి జగన్ ఎమ్మెల్యే సీటు

- Advertisement -

జగన్ సాహసానికి మరో పేరు. టార్గెట్ 175. ప్రతీ సీటు కీలకమే. ఆర్దిక, అంగ బలం ఉన్నవారికే సీట్లు కేటాయించే పరిస్థితి. కానీ, జగన్ లెక్క అది కాదు. జగన్ ధైర్యమే వేరు. ప్రజల నాడి..ప్రజల పైన నమ్మకం ఉన్న నేత కావటంతో ఎలాంటి నిర్ణయాలకు వెనుకాడరు. ఎన్నికల ఖర్చు మాత్రమే కాదు నెలవారీ ఖర్చుల కోసం ఇబ్బంది పడిన వారిని సైతం చట్ట సభలకు పంపిన ఘనత జగన్ సొంతం. 2019లో తరహాలో ఈ సారి జగన్ సామాన్యులను పట్టం కడుతున్నారు. నాడు నందిగం సురేషన్ ను ఏకంగా పార్లమెంట్ సభ్యుడిని చేసారు. ఇప్పుడు ఒక కూలీ కుమారుడు.. ఏ మాత్రం ఆర్దిక స్తోమత లేని నిరుపేదకు సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి మరీ సీటు కేటాయించారు. పార్టీకి సేవ చేయటమే అతనికి ఉన్న మెరిట్. అది చాలదా టికెట్ ఇవ్వటానికి..ఇక గెలిపించుకోవటానికి నేను లేనా అనేదే జగన్ లెక్క.

ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర ఎస్సీ నియోజకవర్గం. అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామిని మార్చారు. ఎవరికీ పెద్దగా తెలియని ఈర లక్కప్ప అనే సాధారణ వ్యక్తిని ఇంఛార్జ్ గా నియమించారు. దీంతో అసలు ఈర లక్కప్ప ఎవరని ఆరా తీయటం మొదలు పెట్టారు. అప్పుడు వెలుగులోకి వచ్చిన వాస్తవాలు చూసి ఏంటీ జగన్ ధైర్యం. జగన్ మాత్రమే ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరనే అభినందనలు మొదలు అయ్యాయి. ఈర లక్కప్ప మాజీ సర్పంచ్. లక్కప్ప స్వగ్రామం గుడిబండ మండలం పలారం. తండ్రి దివంగత లక్కప్ప సాధారణ వ్యవసాయ రైతు కుటుంబం. ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. అయితే.. గతంలో అతి సామాన్య వ్యక్తిగా ఉన్న నందిగం సురేష్ ఏకంగా బాపట్ల ఎంపీగా చేసిన ఘనత కూడా జగన్ కే దక్కింది.

ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోట్లాది రూపాయాలు కావాలి. కానీ, జగన్ లెక్కల్లో మాత్రం అభిమానమే కొలమానం. లక్కప్పకు మద్దతుగా 74 పంచాయితీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసలు మద్దతుగా నిలిచారు. టికెట్ ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. అసలు టీడీపీ ఇలాంటి సాహసం చేయగలదా. దళితులకు ప్రాధాన్యత ఇవ్వటమే కాదు, దళితుల్లో నిజమైన పేదలను గుర్తించి వారికి అవకాశం ఇవ్వటమే నిజమైన సాధికారతగా అమల్లో చూపిస్తున్నారు. ఈ సారి అభ్యర్దుల ఖరారులో పార్టీలో కింది స్థాయిలో పని చేసిన నలుగురు జెడ్పీటీసీలకు ఎమ్మెల్యేలుగా జగన్ అవకాశం ఇచ్చారు. ఇచ్ఛాపురం, దర్శి, ఆలూరు వంటి నియోకవర్గాల్లో వారినే ఇంఛార్జ్ లుగా నియమించారు. ప్రతీ కార్యాలయానికి నడుచుకుంటూ వెళ్తూ సామాన్యుడిలా అందరితోనూ కలిసిపోయే ఈర లక్కప్ప ఎంపిక ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతోంది. లక్కప్పకు ఉన్నది స్థానికంగా మద్దతు మాత్రమే. ఇక్కడ మరో విషయం ఏంటంటే సీటు కోసం లక్కప్ప ఏనాడు సీఎంను కలవలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోస్తున్న కార్యకర్త. దీని ద్వారా వైసీపీలో పార్టీ కోసం పని చేసి చివరి కార్యకర్తకు అవకాశం వచ్చిన సమయంలో ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనేది జగన్ మరోసారి స్పష్టం చేశారు.

శ్రీధర్ రెడ్డి అవుతు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -