Saturday, May 4, 2024
- Advertisement -

చిన్న సినిమా వందరోజులు..దర్శకుడు ఎమోషన్

- Advertisement -

సంక్రాంతి రేసులో చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన చిత్రం హనుమాన్. జనవరి 12న రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించగా తేజ సజ్జ హీరోగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ఈ సినిమా రిలీజ్ అయి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. హనుమాన్ వంద రోజుల వేడుకలను థియేటర్లలో జరుపుకోవడం నా లైఫ్ టైం ఆరాధించే క్షణం. ఈ రోజుతో అది జ‌రిగింది. ఇటీవ‌ల కాలంలో ఒక చిన్న సినిమా వచ్చి థియేట‌ర్‌ల‌లో వంద రోజులు కంప్లీట్ చేసుకోవ‌డం అనేది అరుదు. ఈ మైలురాయిని అందించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ నా వెన్నంటే ఉండి నాకు మద్దతునిచ్చిన మీడియా మిత్రులకు, నా టీమ్ మొత్తానికి ధన్యవాదాలు అని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -