తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ‘అఖిల్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. వివివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘అఖిల్’ పెద్దగా సక్సెస్ సాధించలేదు.. కానీ అఖిల్ పర్ఫామెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను చిత్రాల్లో నటించినా పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాడు.

ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో అఖిల్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అక్కినేని వారసుడు అఖిల్ ఈరోజు తన 27వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా తన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ‘ఏజెంట్’ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డిల క్రేజీ కాంబినేషన్లో రానున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నిఏకే ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర, సురెందర్2 సినిమా బ్యానర్ పై సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.
అల్లు అర్జున్ ’థాంక్యూ’ ఎన్ని సార్లు ..?
ఏపి లో అభ్యర్థులు మృతి.. 81 చోట్ల వాయిదా..!
ఓ వైపు ఎన్నికలు.. మరో వైపు అక్కడికి చేరుకున్న చంద్ర బాబు నాయుడు..!