అల్లు అర్జున్ ’థాంక్యూ’ ఎన్ని సార్లు ..?

- Advertisement -

అలా వైకుంఠపురము సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 వచ్చింది. అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా బుధవారం ‘పుష్ప’ టీజర్‌ విడుదల అయింది. “తగ్గేదే.. లే” అంటూ చిత్తూరు యాసలో బన్నీ చెప్పే డైలాగు ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంది.. టీజర్‌ కుడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

అలాగే నిన్నా ఇంట్రడక్షన్ పుష్ప రాజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో అల్లు అర్జున్ 9 నిమిషాల పాటు మాట్లాడారు. ఇందులో మెదట 4 నిమిషాలు తెలుగులో మాట్లాడుతూ థాంక్యూ… థాంక్యూ… థాంక్యూ… అంటు 31 సార్లు థాంక్యూ చెప్పాగా… తరువాత ఇంగ్లీష్ లో మాట్లాడుతూ మరో 56 సార్లు థాంక్యూ చెప్పారు. మెత్తానికి 9 నిమిషాల గడువులో 87 సార్లు థాంక్యూ చెప్పారు అల్లు అర్జున్.

- Advertisement -

సరికొత్త ఫార్మాట్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ నటుడు ధనంజరు, ప్రకాష్‌రాజ్‌, జగపతి బాబు, హరీష్‌ ఉతామన్‌, వెన్నెల కిషోర్‌, అనీష్‌ కురువిల్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉండాగా.. ఆగస్టు 13న రిలీజ్ కానుంది.

మారుతి డైరెక్ష‌న్‌లో రవితేజ మూవీ !

అప్పుడు నో చెప్పి.. ఇప్పుడు ఓకే అన్న సాయి పల్లవి!

పూరి జగన్నాథ్‌పై ఛార్మి సీరియస్‌.. కారణం ఇదేనా?

అలాంటి వారిని దూరం పెట్టండి.. సురేఖ వాణి షాకింగ్‌ పోస్ట్‌

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -

Latest News